Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు!

Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు!ఎక్కువ పోషకాలను కలిగి ఉన్న నల్ల రంగు క్యారెట్ గురించి ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగు చేసే ఈ క్యారెట్‌లో ఆరోగ్యానికి ఉపయోగకరమైన సమ్మేళనాలు విస్తృతంగా ఉంటాయి. వీటి ప్రత్యేక నలుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్‌లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, సాధారణ ఆరెంజ్ క్యారెట్‌లో ఉండే బీటా-కెరోటిన్ కంటే 10 రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోనే గుణం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఈ నల్ల క్యారెట్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.

Black Carrot Benefits
Black Carrot Benefits

ఇప్పటి వరకూ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మాత్రమే కనిపించే ఈ నల్ల క్యారెట్ సాగుకు, ఇప్పుడు దక్షిణాదిలోనూ అవకాశాలు తెరుచుకుంటున్నాయి. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఈ సాగును ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విత్తనాలను తెప్పించి, కున్నూర్‌లోని సిమ్స్ పార్కు నర్సరీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా పండించడం మొదలుపెట్టారు. సాధారణంగా కేకులు, హల్వాలు, జ్యూస్ తయారీలో విస్తృతంగా వినియోగించే ఈ క్యారెట్ పంట మూడు నుండి మూడున్నర నెలల్లోనే దిగుబడిని ఇస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ఇక్కడి రైతులకు కొత్త పంట అవకాశాలు లభించనున్నాయి.

Also Read: గుమ్మడికాయ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ఆరోగ్య ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తి పెంపు
నల్ల క్యారెట్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఇది సహాయపడుతుంది.

2. జీర్ణక్రియ మెరుగుదల
ఈ క్యారెట్‌లో ఉన్న అధిక పీచు పదార్థం జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గింపు
ఆంథోసైనిన్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్ శక్తి క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కొలన్, బ్రెస్ట్ క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

4. గుండెకు మేలు
నల్ల క్యారెట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బ్లాక్ క్యారెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా కేకులు, హల్వాలు, మిఠాయిలు, తాజా జ్యూస్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. నీలగిరిలో ఈ పంట విజయవంతమైతే, దక్షిణాదిలోని రైతులకు కూడా ఈ కొత్త పంట ద్వారా లాభదాయకమైన వ్యవసాయ అవకాశాలు లభించనున్నాయి.


Post a Comment (0)
Previous Post Next Post