Kakanmath Temple Mystery: పునాది లేకుండా దెయ్యాలు నిర్మించిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Kakanmath Temple Mystery: భారతదేశంలో వేల ఏళ్ల కిందటి దేవాలయాలు ఇవాళ కూడా అద్భుతంగా నిలిచి ఉండటానికి కారణం వాటి బలమైన పునాదులు, శాస్త్రీయ నిర్మాణాలు. భూకంపాలు, తుఫానులు వచ్చినా చెక్కుచెదరకుండా కాలాన్ని జయించిన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. అయితే ఒక ఆలయం మాత్రం ఈ లాజిక్‌కు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. పునాది లేకుండా, కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చినట్టే ఉన్న ఈ దేవాలయం ఎవరైనా నిర్మించిదా? లేక స్వతంత్రంగా రాళ్లు పేరుకుపోయాయా? అనే సందేహం కలుగుతుంది. దాదాపు వెయ్యేళ్ల కిందటి ఈ ఆలయం గురించి తెలిసే ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యమే. అంతేకాదు, దీనిని దెయ్యాలు నిర్మించారని కూడా కొందరు నమ్ముతారు. మరి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

Kakanmath Temple Mystery
Kakanmath Temple Mystery

మధ్యప్రదేశ్‌లోని కాకన్మత్ గుడి - నిర్మాణమే ఒక రహస్యం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనాలోని సియోనియా గ్రామంలో ఉన్న ఈ పురాతన ఆలయం మొదట చూసిన వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో ఎక్కడా సున్నం లేదా జిగురు ఉపయోగించలేదు. కేవలం రాళ్లను పేర్చడం ద్వారా మొత్తం నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయాన్ని కాకన్మత్ గుడి అని పిలుస్తారు. దీని శిఖరం సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండటం విశేషం. శిల్పాలు, దేవతా మూర్తుల ఆకృతులు అద్భుతంగా చెక్కబడి ఉండటం ఆ కాలపు శిల్పకళా ప్రతిభను చూపిస్తుంది. ఆలయం చుట్టూ గతంలో ప్రహరీ గోడలు, ప్రకారాలు, మండపాలు ఉన్నాయని, అయితే కాలక్రమంలో అవి ధ్వంసమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. కానీ గర్భగుడి మాత్రం అలాగే నిలిచి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Also Read: ఖజురహో ఆలయంలోని శివలింగం కింద దాగి ఉన్న రహస్యం తెలుసా?

కీర్తి సింహ నిర్మించిన గుడి… లేదా గంధర్వుల కట్టడం?
చరిత్ర ప్రకారం, ఈ ఆలయాన్ని కల్చూరి రాజవంశానికి చెందిన కీర్తి సింహ అనే రాజు నిర్మించాడని తెలుస్తోంది. రాళ్లలో ఉన్న ప్రత్యేకమైన మాగ్నెటిక్ లక్షణాలు ఒకదానిని మరొకటి బలంగా పట్టుకుని నిలబడేలా చేశాయని విశ్వసిస్తారు. అయితే మరో వాదన ప్రకారం, రాజు తన రాణి కకనవతి కోసం ఈ గుడిని నిర్మించాడని, అందుకే దీనికి ‘కాకన్మత్’ అనే పేరు వచ్చిందని చెబుతారు.

పురాణ గాథల ప్రకారం, ఈ ఆలయాన్ని కేవలం ఒకే రాత్రిలో గంధర్వులు నిర్మించారని కూడా ప్రచారం ఉంది. ‘కకన’ అంటే శక్తి, ‘మత్’ అంటే గుడి. కనుక ఈ ఆలయంలో ఒక ప్రత్యేక శక్తి ఉందని, అందుకే ఇది వేల ఏళ్లుగా రాళ్లతో ఉన్నా ధ్వంసం కాలేదని స్థానికులు నమ్ముతుంటారు.

భూకంపాలు వచ్చినా చెల్లాచెదరుకాలేదు
ఈ ఆలయం నిర్మించబడిన తర్వాత ఎన్నో శతాబ్దాల కాలంలో దుర్భర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని భారీ భూకంపాలు కూడా వచ్చాయి. కానీ ఇంకా ఇవాళ కూడా ఈ ఆలయం నిలిచి ఉండటం ఒక పెద్ద ఆశ్చర్యమే. ఎత్తైన శిఖరం, అందమైన స్తంభాలు, గర్భగుడికి వెళ్లే సన్నని ప్రాంగణం ఇవి అన్నీ 11వ శతాబ్దపు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ ఆలయాన్ని భారతదేశంలోని అత్యద్భుత పురాతన దేవాలయాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post