Kiradu Temple Mystery: ఆ గుడికి వెళ్తే రాయిగా మారుతారు

 Kiradu Temple Mystery: ఎనిమిది వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఆ గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపెడుతోంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా హాత్మా గ్రామంలోని 'కిరాడు ఆలయం' శిల్పసంపదకు నిలయం. అయితే వీరి భయానికి, ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.

పూర్వం ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటనలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్లు దేవాలయంలో ఉన్నారట. తర్వాత తీర్థయాత్రలకు వెళ్లొస్తానని చెప్పి, శిష్యులను గుడిలోనే వదిలేసి వెళ్లారట.

ఓ శిష్యుడు అనారోగ్యపాలవడంతో గురువు తిరిగి రాగా..గ్రామస్థులు ఎవరూ పట్టించుకోలేదని, ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని శిష్యులు చెప్తారట. గురువు ఆగ్రహంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్లుగా మారుతారని శపించి, వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్లిపొమ్మని మహిళకు చెప్పారట. ఆమె పరిగెడుతూ తిరిగి ఏం జరుగుతుందని చూస్తుందట. దీంతో ఆమె కూడా రాయిగా మారిందట. ఇప్పటికీ ఆమె విగ్రహం అక్కడే ఉందట. ఈ భయంతోనే గ్రామ ప్రజలు రాత్రి సమయంలో ఆ గుడికి వెళ్లట్లేట. ఎందుకంటే, ఇప్పటికీ ఈ శాపం పని చేస్తుందన్న గాథ అక్కడ బలంగా నానుతూనే ఉంది.

Also Read: తుప్పు పట్టని మెహ్రౌలి ఐరన్ పిల్లర్ గురించి మీకు తెలుసా?

కిరాడు ఆలయం చూడటానికి అద్భుతమైన శిల్పకళతో కట్టబడింది. రాజపుతానా శైలిలో నిర్మితమైన ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి శిల్పం కళాత్మకతతో పాటు ఆధ్యాత్మికతను కూడ నూరిపోస్తుంది. కానీ… ఎంత అందమైనది అయినా, రాత్రిపూట ఈ ఆలయం చుట్టూ నెలకొని ఉండే నిశ్శబ్దం మాత్రం చీకటి గాథలను గుర్తు చేస్తుంది.

ఇంకొంతమంది చరిత్రకారులు, పర్యాటకులు రాత్రిపూట ఆలయం సందర్శించాలని ప్రయత్నించగా, కొన్ని అనూహ్యమైన సంఘటనలు ఎదురయ్యాయని చెబుతారు. కెమెరాలు పని చేయకపోవడం, చుట్టూ వింత శబ్దాలు వినిపించడం, ఆకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం వంటి అనుభవాలు అక్కడ ఎదురయ్యాయట. వీటివల్ల ఈ గుడిని “భారతదేశంలోని అత్యంత శాపిత దేవాలయాల్లో” ఒకటిగా పరిగణిస్తున్నారు.

Also Read: సంగీతాన్ని వినిపించే మెట్లు

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post