Criticism on Jagan’s Governance: వైయస్సార్సీపీ ఘోర పరాజయానికి ఈ నిర్ణయమే కారణమా?

Criticism on Jagan’s Governance: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మూడు రాజధానుల సిద్ధాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు ప్రాంతాల ప్రజల మన్ననలను పొందాలని వైసీపీ ప్రయత్నించింది. అయితే అది ప్రకటనల వరకే పరిమితమైపోయింది. కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఫలితంగా మూడు ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. ఈ నిరసన ప్రతిఫలం 2024 ఎన్నికల్లో ఘోర పరాజయంగా మారింది. అమరావతి, విశాఖ, కర్నూలు మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ ప్రజల మద్దతు కోల్పోయింది. పాలనా రాజధాని కడతానన్న విశాఖలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అమరావతిని నిర్వీర్యం చేశారన్న ఆవేదనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలు ప్రాంత ప్రజలు కూడా వైసీపీని తిరస్కరించారు. చివరికి మూడు ప్రాంతాల్లోనూ పార్టీ ఏ వర్గానికీ చేరుకోలేకపోయింది.

Criticism on Jagan’s Governance
Criticism on Jagan’s Governance

కూటమి నయా ఫార్ములా - అమరావతిని ఏకైక రాజధానిగా
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక నయా ఫార్ములాతో ముందుకు సాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయించి, మేటి నగరంగా తీర్చిదిద్దే పనిలో ఉంది. అదే సమయంలో విశాఖకు కూడా ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. భారీగా ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఇన్వెస్టర్లు విశాఖలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాబోయే పెట్టుబడుల సదస్సులో దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అంచనా.

Also Read: జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ప్రణాళిక.. 2029 ఎన్నికల కోసం వైసీపీ రీసెట్!

విశాఖపై ప్రజల విశ్వాసం తిరిగి పెరిగింది
వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో విశాఖను రాజధానిగా ప్రకటించినా, అభివృద్ధి పరంగా పెద్ద మార్పు రాలేదు. “రాజధాని” అనే పదం మాత్రమే ఉండి, ఆచరణలో అభివృద్ధి కనిపించకపోవడంతో ప్రజలు నమ్మలేదు. అయితే కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు కలగడం విశాఖ ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి రూపంలో మార్పును చూడటం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పట్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో సానుకూల వాతావరణం నెలకొంది.

అమరావతి నిర్మాణం వేగం - ఐదు జిల్లాల్లో ఆనందం
అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దాంతో చుట్టుపక్కల ఐదు జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యం ఎదుర్కొన్న ఈ ప్రాంతం ఇప్పుడు తిరిగి అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా చంద్రబాబు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. అలాగే రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు.

అభివృద్ధినే కోరిన ప్రజలు - చంద్రబాబుకు ప్రశంసలు
మూడు రాజధానులను తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఈ మార్పును ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల ఆశలు నెరవేర్చడంలో ఆయన చూపిస్తున్న దూరదృష్టి పట్ల చాలామంది “సెల్యూట్ చెప్పాల్సిందే” అంటున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post