Jubilee Hills By-Election Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ.. కాంగ్రెస్ వైపు మొగ్గుతున్న సర్వేలు!

Jubilee Hills By-Election Exit Polls: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. గత కొద్ది వారాలుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు గులాబీ, కాషాయం, కాంగ్రెస్.. ఈ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రతి పార్టీకి చెందిన నాయకులు పరస్పరం తీవ్రమైన మాటల యుద్ధం సాగించారు.

Jubilee Hills By-Election Exit Polls
Jubilee Hills By-Election Exit Polls

ప్రచార యుద్ధం - సోషల్ మీడియా దాకా విస్తరించింది
ప్రచార వేళ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో మరింత చురుకుదనం ప్రదర్శించింది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. మరోవైపు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనేక విమర్శలు గుప్పించారు. పలు న్యూస్ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ ప్రజల రెఫరెండం అవుతుందని పేర్కొన్నారు.

పోలింగ్ రోజు - కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సుమారు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. రహమత్ నగర్ నుంచి బోరబండ వరకు ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. అంచనా వేసినట్టుగా పోలింగ్ శాతం నమోదు కాకపోయినప్పటికీ, సాయంత్రం వరకు ఓటింగ్ కొనసాగింది.

పార్టీల మధ్య ఉద్రిక్తత - ఫిర్యాదులు వెల్లువెత్తాయి
కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మరియు గులాబీ పార్టీ నాయకుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. రెండు పార్టీలకు చెందిన నేతలు పరస్పరం ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇరువైపులా వినిపించాయి.

ఎగ్జిట్ పోల్స్ - కాంగ్రెస్ వైపు ఆధిక్యం!
పోలింగ్ ముగిసిన అనంతరం, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులున్న సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. వీటిలో మెజారిటీ సంస్థలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించాయి.

- చాణక్య స్ట్రాటజీస్ సర్వే: కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం 46%, గులాబీ పార్టీకి 41%, భారతీయ జనతా పార్టీకి 6%.
- పీపుల్స్ పల్స్ సర్వే: కాంగ్రెస్ పార్టీకి 48%, గులాబీ పార్టీకి 41%, బీజేపీకి 6%.
- స్మార్ట్ పోల్ సర్వే: కాంగ్రెస్ పార్టీకి 48.2%, గులాబీ పార్టీకి 42.1%, బీజేపీకి 6%.
- నాగన్న సర్వే: కాంగ్రెస్ పార్టీకి 47%, గులాబీ పార్టీకి 41%, బీజేపీకి 8%.

ఫలితాలపై ఆసక్తి - రాజకీయంగా కీలక సంకేతం
ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానుందన్న ఆశక్తి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.


Post a Comment (0)
Previous Post Next Post