Baba Vanga predictions 2026: భయపెడుతున్న బాబా వంగా భవిష్యవాణి! 2026లో ఏమి జరగబోతోందో తెలుసా?

Baba Vanga predictions 2026: ప్రఖ్యాత జ్యోతిష శాస్త్ర నిపుణురాలు బాబా వంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పేరు. బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పిన అనేక జ్యోతిష్య అంచనాలు దాదాపు నిజమయ్యాయి. అమెరికాలో జరిగిన 9/11 దాడులు, బయో వెపన్స్ ద్వారా ప్రపంచంలో విధ్వంసం, అలాగే కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి కీలక సంఘటనలను ఆమె ముందుగానే సూచించారు. ఇప్పటివరకు ఆమె చేసిన ప్రతి సంవత్సరం జ్యోతిష్య అంచనాలు ఆశ్చర్యకరంగా నిజం కావడంతో, ప్రపంచం ఆమె భవిష్యవాణిని ఆసక్తిగా గమనిస్తోంది.

Baba Vanga predictions 2026
Baba Vanga predictions 2026

మూడవ ప్రపంచ యుద్ధం హెచ్చరిక: బాబా వంగా జ్యోతిష్య అంచనాల ప్రకారం, 2025లో అనేక దేశాల్లో యుద్ధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆమె చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని యుద్దాలు అయితే జరిగాయి. అంతేకాకుండా.. ఆమె అంచనా ప్రకారం, 2026 సంవత్సరం అత్యంత భయానకంగా ఉండబోతోందని తెలిపింది. 2026లో ప్రపంచాన్ని కుదిపేసే మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశముందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, 2026లో ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభాలు, మరియు కృత్రిమ మేధస్సు (AI) అదుపు తప్పడం వంటి ప్రమాదాలు చోటుచేసుకోబోతున్నాయని హెచ్చరించారు. మొత్తం మీద 2026 సంవత్సరం ప్రపంచానికి ఒక ప్రమాదకరమైన మలుపు అవుతుందని ఆమె సూచించారు.

బాబా వంగా భవిష్యవాణిలో కీలక అంశాలు
బాబా వంగా చేసిన 2026 అంచనాల్లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆమె ప్రకారం, బంగారం ధరలు భారీగా పెరుగుతాయి, సెల్‌ఫోన్ల రేడియేషన్ కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్ర ముప్పులో పడుతుంది. అదేవిధంగా, కృత్రిమ మేధస్సు వృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోతారని తెలిపారు. తూర్పు దేశాల నుంచి ప్రారంభమయ్యే ఒక యుద్ధం పశ్చిమ దేశాలను బలహీనపరుస్తుందని, రష్యా నుంచి ఒక శక్తివంతమైన నాయకుడు ఉద్భవించి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడని ఆమె పేర్కొన్నారు.

గ్రహాంతరవాసులతో సంబంధాలు
బాబా వంగా ప్రకారం, 2026లో భారీ వరదలు, పెను భూకంపాలు, మరియు వాతావరణ మార్పులు తీవ్ర స్థాయిలో చోటుచేసుకోబోతున్నాయి. ఆమె అంచనా ప్రకారం, మానవులు ఈ కాలంలో గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. అంతరిక్ష జీవులతో మాట్లాడే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని కూడా ఆమె పేర్కొన్నారు.

2026పై ప్రపంచ దృష్టి
మొత్తం మీద, బాబా వంగా చెప్పిన భవిష్యవాణులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, మరియు పర్యావరణ మార్పులు 2026 సంవత్సరం భయానకంగా ఉండబోతోందని సూచిస్తున్నాయి. ఇక రెండు నెలల్లో 2025 ముగుస్తుండటంతో, బాబా వంగా జ్యోతిష్య అంచనాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


Post a Comment (0)
Previous Post Next Post