AIIMS Recruitment 2025: AIIMS దేశవ్యాప్తంగా భారీ నియామకాలు.. మొత్తం 1,383 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

AIIMS Recruitment 2025: న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్ మరియు కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో గ్రూప్-B, C కేటగిరీలలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,383 పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 డిసెంబర్ 2వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

AIIMS Recruitment 2025
AIIMS Recruitment 2025

భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 121 పోస్టులు
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ - 102 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 / టెక్నీషియన్ - 80 పోస్టులు
జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) - 71 పోస్టులు
టెక్నీషియన్ (రేడియాలజీ) - 105 పోస్టులు
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 121 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్ / జూనియర్ ఫిజియోథెరపిస్ట్ - 46 పోస్టులు
సానిటరీ ఇన్‌స్పెక్టర్ / సానిటరీ ఇన్‌స్పెక్టర్ జీడీ - 33 పోస్టులు
ఫార్మసిస్ట్ / ఫార్మసిస్ట్ గ్రేడ్-2 - 35 పోస్టులు
అసిస్టెంట్ డైటీషియన్ - 17 పోస్టులు

Also Read: KVS,NVS రిక్రూట్మెంట్ 2025.. టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు భారీ అవకాశాలు!

అర్హతలు మరియు విద్యార్హతలు
సంబంధిత పోస్టులను అనుసరించి దరఖాస్తుదారులు పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా అవసరం.

వయోపరిమితి మరియు వయస్సులో సడలింపు
భర్తీ చేయబోయే విభాగాలను అనుసరించి అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వయస్సులో సడలింపు ఇలా ఉంటుంది:
SC / ST: 5 ఏళ్లు
OBC: 3 ఏళ్లు
PwBD: 10 ఏళ్లు
ఈ అర్హతలతో ఉన్న అభ్యర్థులు నిర్ణయించిన గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు
జనరల్ & OBC: ₹3,000
SC, ST, EWS: ₹2,400

ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ వివరాలను AIIMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తారు.


Post a Comment (0)
Previous Post Next Post