KVS NVS Recruitment 2025: KVS,NVS రిక్రూట్మెంట్ 2025.. టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు భారీ అవకాశాలు!

KVS NVS Recruitment 2025: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) సంయుక్తంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో టీచింగ్, నాన్‌–టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం దాదాపు 15,101 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1,288 కేవీ పాఠశాలలు, 653 జవహర్ నవోదయాలు పనిచేస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ఎక్కడైనా గ్రామీణ, పట్టణ లేదా రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో పని చేయాల్సి ఉంటుంది.

KVS NVS Recruitment 2025
KVS NVS Recruitment 2025

పోస్టులు మరియు ఖాళీల వివరాలు

అసిస్టెంట్ కమిషనర్: 17 పోస్టులు

ప్రిన్సిపల్: 227 పోస్టులు

వైస్ ప్రిన్సిపల్ (KVS): 58 పోస్టులు

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs): 2,996 పోస్టులు

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs): 6,215 పోస్టులు

ప్రైమరీ టీచర్స్ (PRT): 2,684 పోస్టులు

PRT (సంగీతం): 187 పోస్టులు

స్పెషల్ ఎడ్యుకేటర్: 987 పోస్టులు
- TGT స్పెషల్ ఎడ్యుకేటర్: 493
- PRT స్పెషల్ ఎడ్యుకేటర్: 494

లైబ్రేరియన్: 281 పోస్టులు
- KVS: 147
- NVS: 134

KVS బోధనేతర పోస్టులు: 1,155

NVS బోధనేతర పోస్టులు: 787

Also Read: ఏఐ రాబోయే దశాబ్దాన్ని ఎలా మార్చనుంది? బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అర్హతలు మరియు అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టు ప్రకారం 10వ తరగతి / 12వ తరగతి / గ్రాడ్యుయేషన్ / 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, B.Ed / ఇంటిగ్రేటెడ్ B.Ed / M.Ed లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: ఆయా పోస్టులపై ఆధారపడి 35 నుంచి 50 సంవత్సరాలు.

నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం తప్పనిసరి.

TEACHING పోస్టులు (PRT & TGT): అభ్యర్థులు CTET అర్హత సాధించి ఉండాలి.

రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 14 నుండి డిసెంబర్ 4 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, రాత పరీక్ష తేదీలు, సిలబస్ వంటి వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.

అధికారిక వెబ్‌సైట్లలో సమాచారం
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో KVS / NVS / CBSE అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అధికారిక పోర్టళ్లను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ, కొత్త అప్ డేట్స్ ను పరిశీలించాలి.


Post a Comment (0)
Previous Post Next Post