Harishchandra Ghat Mystery: హరిశ్చంద్ర ఘాట్ లోని మిస్టరీల గురించి తెలుసా?

Harishchandra Ghat Mystery: భారతదేశంలో శ్మశానాలు ఎన్నో ఉన్నా, హరిశ్చంద్ర ఘాట్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ చితి ఎప్పుడూ ఆరదు. రోజుకు సుమారు 80 నుండి 100 వరకు దహనాలు జరుగుతాయి. వర్షం పడినా, అర్థరాత్రి అయినా, ఎండ ఎక్కువైనా ఇక్కడ అగ్ని ఆరదు. ఈ నిరంతర దహనం, మరణం తప్పనిసరి అన్న నిజాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. కొందరు దీనిని ఒక ముగింపు అని భావిస్తే, ఇంకొందరు దీనిని పునర్జన్మ ప్రారంభంగా చూస్తారు.

Harishchandra Ghat Mystery
Harishchandra Ghat Mystery

ఇది దహన స్థలం మాత్రమే కాదు, ధ్యానం చేసే వాళ్లకు కూడా చాలా ప్రత్యేకమైన ప్రదేశం. విదేశీ పర్యాటకులు, ఆధ్యాత్మిక సాధకులు ఇక్కడ గంటల తరబడి కూర్చుంటారు. ఇక్కడి నిశ్శబ్దం, గంగా ప్రవాహం, దహనాల మధ్య ఉన్న ఆ వాతావరణం ఆశ్చర్యకరంగామనసులో ఒక శాంతి కల్గిస్తుందని వారు చెబుతారు. మరణాన్ని దగ్గరగా చూడటం వల్ల, జీవితాన్ని ఎలా గడపాలో కొత్తగా ఆలోచించే అవకాశం వస్తుంది అంటారు.

ఈ ఘాట్‌కు సంబంధించిన కొన్ని మిస్టరీలు కూడా ఉన్నాయి. రాత్రిపూట కొన్ని సమయాల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని… గాలి ఒక్కసారిగా బరువుగా అనిపిస్తుందని… వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుందని స్థానికులు చెబుతారు. ఇవన్నీ కొందరికి భయంకరంగా అనిపించినా, ఇక్కడికి వెళ్లిన చాలా మంది మాత్రం "ఇది భయం కాదు, ఒక అనుభవం" అంటారు. ఎందుకంటే ఇక్కడి వాతావరణం మనిషి జీవితం గురించి కొత్త అవగాహన ఇస్తుంది.

ఎందుకు చాలా మంది ఇక్కడే దహనం కావాలని కోరుకుంటారు అంటే, వారణాసిని మోక్షనగరంగా భావిస్తారు. హరిశ్చంద్ర ఘాట్‌లో దహనం అయితే పాపాలు పోతాయని, పునర్జన్మ మంచి రూపంలో వస్తుందని నమ్మకం ఉంది. అందుకే భారతదేశం మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న హిందువులు కూడా చివరి యాత్రగా ఇక్కడికి రావాలని కోరుకుంటారు.

హరిశ్చంద్ర ఘాట్ ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఇది మనిషి జీవితంలోని నిజాలను గుర్తు చేసే స్థలం. అహంకారం, ఆస్తి, పేరు ఏదీ చివరకు మనతో రాదని అర్థం చేసుకునే ప్రదేశం. ఈ ఘాట్ జీవితానికి ఒక పాఠశాలలాంటిది… మనం ఎవరమో, ఎందుకు జీవిస్తున్నామో గుర్తు చేసే ఒక నిశ్శబ్ద స్థలం.


Post a Comment (0)
Previous Post Next Post