Astrology Horoscope October 2025: అక్టోబర్ 2025 (1 నుండి 31 వరకు) మాసఫలాలు రాశుల వారీగా చూద్దాం. ఈ నెలలో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుకూలత ఆర్థికంగా, వృత్తి పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరం. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశికి సంబంధించిన వివరాలు ఇవి.
![]() |
Astrology Horoscope October 2025 |
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెల మొత్తం సానుకూలంగా, సంతృప్తికరంగా గడుస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రయాణాలు, ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది కానీ సహచరుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. రుణాలు, బకాయిలు వసూలు అవుతాయి. అనుకోని ప్రయాణాలు జరుగుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలత ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): నెల ప్రథమార్థం అనేక ఆదాయ మార్గాలు తెచ్చిపెడుతుంది. ద్వితీయార్థంలో ఆర్థిక జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ప్రథమార్థం సానుకూలంగా గడుస్తుంది. ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ద్వితీయార్థంలో రవి నీచస్థితి వల్ల ఉద్యోగ సమస్యలు తలెత్తవచ్చు. అధికారులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్త అవసరం. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో కొద్దిపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ప్రథమార్థం సజావుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద సమస్యలు ఉండవు. ద్వితీయార్థంలో కుటుంబ, దాంపత్య సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి. విలాసాలపై ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం సాధారణంగా సాగుతుంది. రుణ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశీ అవకాశాలు కలుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక ఆదాయ మార్గాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): నెలంతా సంతృప్తికరంగా గడుస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబపరమైన ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. మిత్రుల నుంచి రావలసిన డబ్బు రాబడతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రథమార్థంలో ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ద్వితీయార్థంలో పనిభారం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శని దోషం తగ్గిపోతుంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలు ఉండవచ్చు. ఆర్థికంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి.
అక్టోబర్ 2025 రాశిఫలాలు చూస్తే, మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, మకరం వారికి గ్రహాల అనుకూలత బలంగా ఉండి ఆర్థికంగా, వృత్తి పరంగా శుభ ఫలితాలను అందిస్తుంది. కొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.