LPG Cylinder Price Hike: పండుగ సీజన్ మొదలవ్వక ముందే వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు అక్టోబర్ 1, 2025 బుధవారం నుంచి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.15 పెంచాయి. అయితే, ఉపశమనం ఏమిటంటే 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా ఉంది.
![]() |
| LPG Cylinder Price Hike |
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో
- ఢిల్లీ: 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.1595.50. గతంలో ఇది రూ.1580 ఉండేది. అంటే రూ.15.50 పెరిగింది.
- కోల్‌కతా: ధర రూ.1700కి చేరింది. ఇది సెప్టెంబర్‌లో రూ.1684 ఉండేది. అంటే రూ.16 పెరుగుదల.
- ముంబై: ప్రస్తుతం రూ.1547. గతంలో రూ.1531.50 ఉండేది.
- చెన్నై: ఇప్పుడు రూ.1754. సెప్టెంబర్‌లో రూ.1738 ఉండేది. రూ.16 పెరుగుదల ఉంది.
- హైదరాబాద్: ప్రస్తుతం రూ.1817. ఇక్కడ కూడా రూ.16 పెరిగింది.
14 కిలోల గృహ సిలిండర్ ధరలు యథాతథం: 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా రూ.850 నుంచి రూ.960 మధ్య గృహ వినియోగ ధరలు కొనసాగుతున్నాయి.
- ఢిల్లీ: రూ.853
- ముంబై: రూ.852.50
- హైదరాబాద్: రూ.905
తెలుగు రాష్ట్రాల్లో 14 కిలోల సిలిండర్ ధరలు
- హైదరాబాద్: రూ.905
- వరంగల్: రూ.924
- విశాఖపట్నం: రూ.861
- విజయవాడ: రూ.875
పండుగకు ముందే వినియోగదారులకు ఉపశమనం: వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినా, గృహ వినియోగ సిలిండర్ ధరలు అలాగే ఉండటంతో సాధారణ వినియోగదారులకు ఉపశమనం లభించింది.
ఉజ్వల యోజనలో ఉచిత సిలిండర్లు: ఉజ్వల యోజన కింద కోట్లాది మంది మహిళలకు ప్రభుత్వం ఉచిత సిలిండర్లు, కొత్త గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది.
- ఉత్తరప్రదేశ్: యోగి ప్రభుత్వం దీపావళి ముందు రాష్ట్రంలోని 1.85 కోట్ల మహిళలకు ఉచిత LPG సిలిండర్లు అందించనున్నట్లు ప్రకటించింది.
- కేంద్ర ప్రభుత్వం: నవరాత్రి రోజున 25 లక్షల కొత్త ప్రధాని ఉజ్వల కనెక్షన్లు ఇస్తామని తెలిపింది.
