SYG Asura Aagamana Glimpse: సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రివ్యూ.. గూస్ బంప్స్ గ్యారెంటీ!

SYG Asura Aagamana Glimpse: ‘విరూపాక్ష’, ‘బ్రో ది అవతార్’ వంటి చిత్రాల తర్వాత సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కొన్ని సంవత్సరాల తర్వాత చేసిన చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu). తన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.


నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ నుండి ఈ రేంజ్ క్వాలిటీ సినిమా వస్తుందని అసలు ఊహించలేదని, కచ్చితంగా ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఎన్ ఎమ్ - ఇన్‌స్పైరింగ్ జర్నీ

గ్లింప్స్ వీడియోను చూస్తే KGF సినిమా స్టైల్ గుర్తుకు రావడం ఖాయం. సూపర్ హిట్ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్‌ను అనుసరించడం టాలీవుడ్‌లో కొత్తం కాదు. సినిమా డైరెక్టర్ ఎలాంటి టేకింగ్‌తో కథను నడిపించాడో ఆధారపడి సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఉంటుంది. ఈ చిత్రానికి రోహిత్ అనే నూతన దర్శకుడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నిర్మాణ బాధ్యతలను నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్వహిస్తున్నారు.

మూవీ ప్రారంభంగా దసరా కానుకగా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ఆలోచించినప్పటికీ, ‘ఓజీ’ చిత్రం విడుదలతో ఆ ఆలోచనను వాయిదా పెట్టారు. ప్రస్తుతం మేకర్స్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. గ్లింప్స్ వీడియోతోనే విడుదల తేదీని ప్రకటిస్తారని ప్రేక్షకులు ఆశించారు, కానీ అది జరగలేదు.

హీరోయిన్‌గా ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. తమిళంలో మంచి క్రేజ్ కలిగిన ఈ బ్యూటీ, టాలీవుడ్‌లో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. గ్లింప్స్‌లో కొంతమంది ఆయుధాలను తయారు చేసే మనుషులను తీసుకొచ్చి, ఒక ప్రాంతం లో వాళ్ళ చేత రకరకాల ఆయుధాలు చేయిస్తూ, వాళ్ళను హింసకి గురి చేస్తూ ఉంటారు. హీరో తన సమూహంతో కలిసి ఎలా పోరాడుతాడో కథ ద్వారా చూపించడం స్పష్టమవుతుంది. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం ద్వారా వేరే స్థాయికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో టైమ్ మాత్రమే చూపుతుంది.


Post a Comment (0)
Previous Post Next Post