PMVBRY Employment Scheme: దేశంలో ఉద్యోగావకాశాలను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రభుత్వం ₹15,000 వరకు అదనంగా చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగి పైగా ₹3,000 వరకు ప్రోత్సాహకం అందజేస్తారు. కంపెనీలకు ఈ సబ్సిడీ రెండేళ్ల పాటు అందించబడుతుంది. ఉద్యోగులకు మాత్రం ఈ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లిస్తారు. ఈ పథకం ₹1 లక్ష లోపు జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
అప్లికేషన్ ప్రాసెస్ ఎలా?
![]() |
PMVBRY Employment Scheme |
ఎవరు అర్హులు?
- మొదటిసారి ఉద్యోగంలో చేరి ఉండాలి.
- మొదటిసారి EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
- ఉద్యోగి జీతం ₹1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
- కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో పనిచేయాలి.
- కంపెనీ తప్పనిసరిగా EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
కొత్తగా ఉద్యోగంలో చేరి EPFO ఖాతా తెరిచిన వెంటనే ఉద్యోగి ఆటోమేటిక్‌గా PMVBRY పథకానికి అర్హుడవుతాడు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగి యొక్క UAN నంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా అతని బ్యాంక్ ఖాతాలోకి డబ్బును జమ చేస్తుంది. ఒకవేళ డబ్బు జమ కాకపోతే, సంబంధిత కంపెనీని సంప్రదించి EPFO వివరాలు తెలుసుకొని, EPFO పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించడంతో పాటు కంపెనీలకు కూడా ప్రోత్సాహకాన్ని అందించి, దేశంలో ఉద్యోగ అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించడంతో పాటు కంపెనీలకు కూడా ప్రోత్సాహకాన్ని అందించి, దేశంలో ఉద్యోగ అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.