Political Career of Jagan Daughters: జగన్ కుమార్తెల భవిష్యత్తు.. రాజకీయాల్లోనా, లేక వేరే రంగంలోనా?

Political Career of Jagan Daughters: ప్రతి రాజకీయ నాయకుడు తన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే రాజకీయం అనేది గౌరవంతో పాటు ఒక రకమైన వ్యాపారం కూడా. అయితే బడా నాయకుల కుటుంబాల్లో వారసత్వం విషయంలో విభేదాలు రావడం సాధారణం. అలాంటి పరిస్థితి వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) కుటుంబానికీ ఎదురైంది. ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి సొంత పార్టీని స్థాపించారు. ఆ పార్టీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. మరోవైపు కుమార్తె షర్మిల కూడా తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీని ప్రారంభించారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలను చేపట్టారు. ఈ క్రమంలో సోదరుడు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు కొనసాగుతున్నాయి.

Political Career of Jagan Daughters
Political Career of Jagan Daughters

షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంట్రీ: తాజాగా షర్మిల (Sharmila) తన కుమారుడు రాజారెడ్డిని పబ్లిక్‌లోకి తీసుకువచ్చారు. దీంతో ఆయన రాజకీయ ఎంట్రీ ఉంటుందని ప్రచారం మొదలైంది. ఈ విషయంపై షర్మిల స్పష్టంగా స్పందిస్తూ, రాజారెడ్డి తప్పక రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తూ, రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు తన కుమారుడే అని ప్రకటించారు. దీనికి ప్రతిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ, రాజశేఖర్ రెడ్డి అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికే అధికారం అప్పగించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడికి అవకాశమే లేదని తేల్చిచెప్పారు. దీంతో మీడియా, రాజకీయ వర్గాల్లో వాదనలు, డిబేట్లు వేడెక్కాయి.

Also Read: విశాఖలో ఐటీ అభివృద్ధి వెనుక కూటమి ప్రభుత్వ దృష్టి!

వారసత్వ పోరాటం - జగన్ ఆందోళన: రాజశేఖర్ రెడ్డి వారసత్వంపై షర్మిల సవాళ్లు విసరడం వల్ల జగన్ (Y S Jagan Mohan Reddy) ఇప్పటికే ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఆమె చర్యల వల్ల ఆయన రాజకీయంగా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంట్రీ ఇస్తే, తన రాజకీయ వారసత్వం కనుమరుగవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తన కుమార్తెలను రాజకీయ రంగంలోకి తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో వారసత్వాన్ని కొనసాగించడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది నేతలు తమ పిల్లలను ఈ విధంగా ప్రవేశపెట్టారు.

YS Sharmila Son YS Raja Reddy
YS Sharmila Son YS Raja Reddy

జగన్ కుమార్తెల భవిష్యత్ - ప్రచారంలో ఊహాగానాలు: వచ్చే ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డిని తప్పిస్తారని, ఆయన స్థానంలో జగన్ కుమార్తెల్లో ఒకరిని పోటీ చేయిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు జగన్ కుమార్తెల గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం వారు లండన్‌లో చదువులు పూర్తి చేసుకుంటున్నారు.

వైఎస్సార్ కుటుంబ మహిళల రాజకీయాలు: రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంతవరకు కుటుంబ మహిళలు రాజకీయాల్లోకి నేరుగా రాలేదు. వారు కేవలం రాజకీయ వేదికలపై మాత్రమే కనిపించేవారు. కానీ ఆయన అకాల మరణంతో ఆ కుటుంబంలోని మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రాధాన్యత సాధించారు. ఇప్పుడు వారసత్వ రాజకీయాల కారణంగా జగన్ కుమార్తెల పేర్లు వినిపించడం సహజమే. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో కాలమే తేల్చాలి.


Post a Comment (0)
Previous Post Next Post