India Bangladesh Relations: మొదటి సారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ పుల్వామా దాడి జరిపి సైనికులను బలితీసుకుంది. ఆ ఘటనతో ఆగ్రహించిన మోదీ, పాకిస్తాన్‌ను అడుక్కు తినే స్థితికి తీసుకెళ్తామనే ప్రతిజ్ఞ చేశారు. నిజంగానే భారత్ ఇచ్చిన దెబ్బకు పాకిస్తాన్ నేటి పరిస్థితి దారుణంగా మారింది. అప్పు చేయకుంటే ఒక్కరోజు కూడా గడవని స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు అదే మార్గంలో మరో ముస్లిం దేశం కూడా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ దేశమే బంగ్లాదేశ్.
![]() |
| India Bangladesh Relations |
మారిపోయిన దిశలు: స్నేహం నుంచి అపార్థాల వరకు
ఒకప్పుడు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన బంగ్లాదేశ్, ఇప్పుడు పాకిస్తాన్, చైనా అండగా ఉంటానంటూ విర్రవీగుతోంది. దీంతో భారత్ కూడా ఆ దేశానికి తగిన రీతిలో సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. గతంలో వ్యాపార, రాజకీయ రంగాల్లో ఎంతో దగ్గరగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు గణనీయమైన దూరం ఏర్పడింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మసకబారాయి.
Also Read: ఇందిరా గాంధీ.. ఒక అధ్యాయం కాదు, ఒక యుగం!
తాత్కాలిక ప్రభుత్వ విధానాలు: నమ్మకాన్ని దెబ్బతీశాయి
తాత్కాలిక ప్రభుత్వ విధానాలు: నమ్మకాన్ని దెబ్బతీశాయి
తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహ్మద్ యూనస్ తీసుకున్న విదేశాంగ విధానాలు, భారత్-బంగ్లాదేశ్ మధ్య నమ్మకానికి బీటలు వేశాయి. చైనా, పాకిస్తాన్‌ల వైపు మొగ్గు చూపడం న్యూఢిల్లీలో ఆందోళనకు గురిచేసింది. దీనికి ప్రతిగా భారత్ బంగ్లాదేశ్‌కు బియ్యం ఎగుమతిని తగ్గిస్తూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
మునుపు భారత్ బంగ్లాదేశ్‌కు కిలో బియ్యాన్ని రూ.30-32కే సరఫరా చేసేది. కానీ తాజాగా బంగ్లాదేశ్ యూఏఈ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడారి దేశమైన యూఏఈ, భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేసి మరింత ధరకు బంగ్లాదేశ్‌కి విక్రయిస్తోంది. ఫలితంగా బంగ్లాదేశ్ కిలోకు రూ.40-42 చెల్లించి బియ్యం దిగుమతి చేసుకుంటోంది. అంటే ప్రతి కిలోపై దాదాపు రూ.10 అదనపు భారమవుతోంది. లక్ష టన్నుల దిగుమతితో కోట్ల రూపాయల నష్టం వస్తోంది.
విదేశాంగ తప్పిదాలు: బంగ్లాదేశ్‌కు భారమైన ఖర్చు

నోబెల్ బహుమతి గ్రహీత అయిన మహ్మద్ యూనస్, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తున్నానని చెబుతున్నా, ఆయన తీసుకున్న విదేశాంగ నిర్ణయాలు విరుద్ధ ఫలితాలను ఇస్తున్నాయి. పొరుగు దేశాలపై విమర్శాత్మక ధోరణి, అనుచిత వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌కు గణనీయమైన నష్టం తెచ్చిపెడుతున్నాయి.
భారత్‌తో విభేదాల నేపథ్యంలో బంగ్లాదేశ్ చేపల ఎగుమతిని నిలిపివేసింది. దీనికి ప్రతిగా భారత్ బియ్యం ఎగుమతిని తగ్గించింది. ఈ పరిణామాన్ని ఆర్థిక విశ్లేషకులు ‘టిట్ ఫర్ టాట్’ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.
ఆహార భద్రతకు భారత్ తప్ప ప్రత్యామ్నాయం లేదు

ప్రస్తుత పరిస్థితులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. భారత్‌తో సత్సంబంధాలు లేకుండా బంగ్లాదేశ్ తన ఆహార భద్రతను సాధించలేడు. యూనస్ ప్రభుత్వం విదేశీ సమీకరణలను పునరాలోచించకపోతే, ఆ దేశం మరింత ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య పటిష్టమైన మైత్రి పునరుద్ధరించబడకపోతే, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. నీడనిచ్చే చెట్టును నరుక్కుంటే ఎలా ఉంటుందో, అదే పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్‌కు ఎదురవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.