Education and Practical Knowledge: చదువు సరిపోదు.. నైపుణ్యాలే నిజమైన విజయానికి మార్గం!

Education and Practical Knowledge: నేటి కాలంలో చదువుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు చదువుకోవడం అంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అందువల్ల చాలా మంది చదువుకు దూరమయ్యారు. అయితే ఆ కష్టకాలంలో చదువుకున్నవారు, ఉద్యోగాలు సంపాదించి, ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దీంతో నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పటికప్పుడు “చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది, చదువే జీవితం” అని చెబుతుంటారు. కానీ వాస్తవం కొంచెం భిన్నంగా మారుతోంది.

Education and Practical Knowledge
Education and Practical Knowledge

ఒకే స్కూల్ - రెండు విభిన్న ఫలితాలు: ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్న స్నేహితుల్లో ఒకరు చాలా బాగా చదివి సాధారణ ఉద్యోగం చేస్తే, మరొకరు తక్కువగా చదివినా కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద స్థాయిలో ఎదుగుతారు. దీని వెనుక కారణం ఒక్కటే స్కిల్స్. కేవలం చదువు మాత్రమే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోదు. ప్రస్తుత కాలంలో అదనపు నైపుణ్యాలు, ఆలోచనా విధానం, పరిస్థితులను అర్థం చేసుకోవడం వంటి లక్షణాలే ఎదుగుదలకు కీలకంగా మారాయి.

చదువు మాత్రమే సరిపోదు: చాలామంది చదువు అనగానే పుస్తకాలు పట్టుకుని మార్కుల కోసం కష్టపడతారు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు. కానీ ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వారి ప్రతిభ తగ్గిపోతుంది. ఇక సాధారణంగా చదివినవారు, అయితే ప్రాక్టికల్‌గా ఆలోచించగలవారు, మార్కెట్ అవసరాలను అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఎదుగుతారు. ఎందుకంటే, వారు కేవలం పుస్తకాల పరిధిలో కాకుండా, జీవిత పరిజ్ఞానంలో ముందుంటారు.

ప్రస్తుతం కంపెనీలు ఏం చూస్తున్నాయి?
ఇప్పటి కంపెనీలు కేవలం డిగ్రీలు లేదా మార్కులు చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వారు చూస్తున్నది ప్రాక్టికల్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం. కాబట్టి చదువు తక్కువైనా, ఈ నైపుణ్యాలు ఉన్నవారిని కంపెనీలు సంతోషంగా నియమించుకుంటాయి. అదే కారణంగా, నేటి విద్యార్థులు చదువుతోపాటు తమలో ప్రత్యేక ప్రతిభను పెంచుకోవడం అత్యవసరం.

పుస్తక జ్ఞానం మాత్రమే కాదు - సామాజిక అవగాహన కూడా అవసరం: కేవలం ర్యాంకులు సాధించడం కాకుండా, సమాజం ఎలా పనిచేస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం అవసరం, ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనే అవగాహన అవసరం. సమాజంలో మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని, వాటిని ఎదుర్కొనే విధంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటేనే వ్యక్తి నిజమైన అర్థంలో ఎదుగుతాడు.

ఏఐ యుగంలో కొత్త అవసరాలు: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సాధారణ నాలెడ్జ్ కంటే ఏఐ (Artificial Intelligence) నాలెడ్జ్ అత్యంత అవసరమవుతోంది. కంపెనీలు ఇప్పుడు ఏఐ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందువల్ల యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సమస్యల పరిష్కార పద్ధతులపై దృష్టి పెట్టాలి.

చదువు ఎంత ముఖ్యమో, స్కిల్స్ అంతకంటే ముఖ్యమని చెప్పొచ్చు. పుస్తకాలు చదవడం అవసరం, కానీ ఆ జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగించగలగడం మరింత అవసరం. చదువుతోపాటు నైపుణ్యాలను పెంచుకున్నవారే నిజమైన విజేతలు.


Post a Comment (0)
Previous Post Next Post