Shubhanshu Shukla Biography: అంతరిక్ష పరిశోధనలో భారత్ ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రగతి మార్గంలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్న వ్యక్తుల్లో ఒకరు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. భారత వాయుసేనలో అత్యుత్తమ ఫైటర్ పైలట్‌గా తన సేవలను అందించిన ఆయన, ఇప్పుడు ISRO–NASA సంయుక్తంగా నిర్వహిస్తున్న Axiom Mission-4లో అంతరిక్షానికి ప్రయాణించనున్న తొలి భారతీయులలో ఒకరుగా ఎంపికయ్యారు. శుభాంశు శుక్లా బాల్య జీవితం నుంచి వ్యోమగామిగా మారిన ఆయన ప్రాసస్థానం గురించి తెలుసుకుందాం.
శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జన్మించారు. చిన్నతనంలోనే 1999 కార్గిల్ యుద్ధం చూసి స్ఫూర్తి పొందిన ఆయన, సిటీ మాంటిసోరి స్కూల్ (లక్నో)లో విద్యాభ్యాసం పూర్తిచేసి, స్వయంగా NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై భారత రక్షణ శాఖలో చేరారు. 2005లో కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
భారత వాయుసేనలో ప్రస్థానం: 2006లో శుభాంశు శుక్లా భారత వాయుసేనలో ఫైటర్ పైలట్గా నియమితులయ్యారు. ఆయన 2000 గంటలకు పైగా విభిన్న విమానాలపై ప్రయాణించిన అనుభవం కలిగి ఉన్నారు, వాటిలో Su-30 MKI, MiG-21, MiG-29, Jaguar, Hawk, Dornier 228, An-32 ముఖ్యమైనవిగా ఉన్నాయి. 2024లో ఆయనకు గ్రూప్ కెప్టెన్ హోదా లభించింది.
గగన్ యాన్ - వ్యోమగామి శిక్షణ
- 2019లో ISRO (ఇస్రో) 'గగన్ యాన్' మానవ అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాములుగా ఎంపిక చేసినవారిలో శుభాంశు శుక్లా కూడా ఉన్నారు.
- 2020-21 మధ్య ఆయన రష్యాలోని యూరీ గగారిన్ కోస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాథమిక శిక్షణ పొందారు. - అనంతరం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణ కేంద్రంలో అధునాతన శిక్షణ కొనసాగించారు. అతను IISc బెంగళూరు నుంచి Aerospace Engineeringలో M. Tech డిగ్రీ పొందారు.
Axiom Mission 4 (Ax-4) – అంతరిక్ష ప్రయాణం
- శుభాంశు శుక్లా ఇప్పుడు Ax-4 (Axiom Mission 4)లో పాల్గొనబోతున్నారు. ఇది NASA, ISRO, ESA, Axiom Space సంయుక్తంగా చేపడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగం.
- 2025 జూన్ 25న SpaceX Crew Dragon ద్వారా వారు International Space Station (ISS)కు ప్రయాణించనున్నారు. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా పైలట్గా సేవలందిస్తారు.
Also Read: అభయ రాణి అబ్బక్క చౌతా - తొలి స్వాతంత్ర పోరాట యోధురాలు.!
ఈ మిషన్‌లో భాగంగా:
- వ్యవసాయ శాస్త్రం, స్పేస్ బయాలజీపై ప్రయోగాలు చేస్తారు.
- భారత యువతతో లైవ్ వీడియో ఇంటరాక్షన్ నిర్వహిస్తారు.
- భారత్ నుండి ISSకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు.
శుభాంశు శుక్లా భార్య పేరు డా. కమ్నా శుభా శుక్లా. ఆమె ఒక డెంటిస్ట్. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి తండ్రి శంభు దయాల్ శుక్లా ఒక ప్రభుత్వ ఉద్యోగి, తల్లి ఆశా శుక్లా గృహిణి. శుభాంశు కుటుంబంలో చిన్నవాడు. ఆయనకు విద్య, వ్యాయామం, ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తి ఉంది. ఇటీవల ఆయన జ్యోతిషశాస్త్రం మీద కూడా ఆసక్తి పెంచుకున్నారు, అయినా తాను ఆస్థికుడిని కాదని చెబుతారు.
లక్నోకు చెందిన ఒక చిన్న పిల్లవాడు, దేశాన్ని రక్షించాలన్న లక్ష్యంతో NDA చేరి, ఇప్పుడు భారత వ్యోమగామిగా ప్రపంచానికి తలెత్తుకునే స్థాయికి వచ్చిన శుభాంశు శుక్లా జీవితం యువతకు గర్వకారణం, ప్రేరణ కూడా.
Also Read: ప్రపంచానికి నాణేలు పరిచయం చేసినది భారతదేశమే.!
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS