India Russia China Relations 2025: చైనా శిఖరాగ్ర సమావేశంలో చరిత్రాత్మక క్షణం.. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఆత్మీయంగా కలిసిన క్షణం

India Russia China Relations 2025: చైనాలోని తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో జరుగుతున్న 25వ శిఖరాగ్ర సమావేశం సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లను అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సాదరంగా ఆహ్వానించారు. 


ముగ్గురు నేతలు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పుతిన్‌ను ప్రత్యేకంగా పలకరించారు. అనంతరం ముగ్గురు కలిసి సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: మోదీ-పుతిన్-జిన్‌పింగ్ భేటీతో ప్రపంచ దౌత్యానికి కొత్త దిశ!

ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. వాటి కింద "పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇదే సమయంలో, చైనా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం వారితో మరిన్ని చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.


Post a Comment (0)
Previous Post Next Post