Celebrity Divorces: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ పెళ్లిళ్లు ఎంత తర్వగా అవుతున్నాయో..అంతే త్వరగా పెటాకులవుతున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించే జంటలు, వేలాది కోట్ల ఖర్చుతో జరిగిన అంగరంగ వైభవమైన వివాహాలు... కానీ కొన్ని నెలలకే విడాకుల ప్రకటనలు. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య, సానియా-షోయబ్, సైనా-కశ్యప్ వంటి జంటలు ప్రేమకథలు రాసిన వారే... విడిపోయిన వార్తలు చెప్పినవారయ్యారు. ఈ పరిణామాలు అభిమానుల మనసులను కలిచివేస్తున్నాయి.
ఒత్తిడి, అంచనాలు
పెళ్లయ్యాక సెలబ్రిటీలపై చాలా అంచనాలు ఏర్పడతాయి. వారి ప్రేమ, వ్యక్తిగత జీవితం కూడా పబ్లిక్ ఓనర్షిప్ లోకి వెళ్లిపోతుంది. విడిగా కనిపించినా కథనాలు, కలిసి ఉన్నా గాసిప్స్... ప్రతి అడుగూ, చిరునవ్వూ కూడా రీల్స్ లోకి మారిపోతుంది. ఇది వారిలో ఒత్తిడిని పెంచి, సాధారణ జీవితం గాడి తప్పించేస్తుంది. చిన్న గొడవలే పెద్దవిగా అవుతాయి.
వ్యక్తిత్వ ఘర్షణలు
ఇద్దరు సెలబ్రిటీలు కలిసి ఉండడమనేది రెండు దృఢమైన వ్యక్తిత్వాల మధ్య గొడవకు మారే అవకాశాన్ని పెంచుతుంది. కెరీర్ లో ఎదిగిన వాళ్లు వ్యక్తిగతంగా తగ్గడం ఇష్టపడరు. ‘నేను కాదు, నువ్వే తగ్గాలి’ అనే స్థితి వారి బంధాన్ని బలహీనపరుస్తుంది. ఒకరి కోసమే ఇంకొకరు కావాలని అర్థం చేసుకోవడంలోనే అసలు సమస్య మొదలవుతుంది.
లాంగ్ డిస్టెన్స్
తమ తమ కెరీర్ లో బిజీగా ఉండే సెలబ్రిటీలు చాలా కాలం వేర్వేరు దేశాల్లో జీవిస్తుంటారు. భార్యాభర్తల మధ్య సమయం లేకపోవడం, కలసి ముచ్చట్లు పెట్టే క్షణాలు ఉండవు. ఈ ఫిజికల్ డిస్టెన్స్ నెమ్మదిగా ఎమోషనల్ డిస్టెన్స్‌గా మారుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగి, అర్థం చేసుకోవడంలో లోపాలు తలెత్తుతాయి.
Also Read: మరోసారి పెళ్లి పీటలెక్కనున్న సానియా మీర్జా? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలు
మనలాంటోళ్లే
గ్లామర్ లో పెరిగిన ప్రేమలు, నిజమైన జీవితం ఎదురైనప్పుడు తట్టుకోలేవు. పెళ్లి అనేది కేవలం ఇమేజ్ కాదు. అది బాధ్యతలతో కూడిన ప్రయాణం. కానీ గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చిన ప్రేమలు చాలాసార్లు వాస్తవ జీవితం ఎదురయ్యేటప్పుడు తేలిపోతాయి.
సెలబ్రిటీలు కూడా మనలాగే మనుషులు. ప్రేమకు సమయం, సహనం, నమ్మకం అవసరం. కానీ వాటిని పెంచుకునే వ్యక్తిగత స్పేస్ ఈ వెలుగు ప్రపంచంలో చాలా అరుదు.
Also Read: సమంత రెండో పెళ్లి అతనితోనా? వైరల్‌గా బ్యూటీ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్