Kantara Chapter 1 Trailer - Telugu: చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గుర్తుందా? అదే కాంతార. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభించింది. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటించింది.
![]() |
Kantara Chapter 1 Trailer - Telugu |
ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందుతున్నది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 02న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేయబడింది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ గూస్ బంప్స్ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్, రుక్మిణి వసంత్ అందం మరింత ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు.
కాంతార తొలి భాగంలో ఏమి జరిగిందో సింపుల్‌గా చూపించారు. అయితే ప్రీక్వెల్‌లో రాజులు, యుద్ధాలు, రాజకుమారి తో హీరో ప్రేమలో పడడం వంటి ఎన్నో అంశాలను చూపించనున్నారు. ప్రస్తుతం విడుదలైన కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి సృష్టించింది. ప్రతి సీన్ మరింత ఉత్కంఠను పెంచుతుండగా, ఈసారి కాంతార చాప్టర్ 1 ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.