Venkatesh Naidu: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కలకలం రేపుతున్న నేపథ్యంలో, గత రెండు రోజులుగా చెరుకూరు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చర్చల్లో నిలిచారు. లిక్కర్ స్కాంను మించి ఈ వ్యక్తి చుట్టూ కొనసాగుతున్న చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. వెంకటేష్ నాయుడు ఎవరు? అతని వెనుక ఉన్నది ఎవరు? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి.
Also Read: చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ.. దీర్ఘకాలిక ప్రధానిగా మరో మైలురాయి!
చెరుకూరు వెంకటేష్ నాయుడు, తండ్రి పేరు తిరుపతి నాయుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న వెంకటేష్ వయస్సు 36 సంవత్సరాలు. ఈయన లిక్కర్ కేసులో ఏ34గా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. లిక్కర్ స్కాం డబ్బును తరలించడంలో సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడిని జూన్ 18న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో సిట్ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచే ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు పెద్ద దుమారం రేపుతోంది. రెండు రోజులుగా ఆయన చుట్టూనే రాజకీయ చర్చలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. వైసీపీ మరియు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి వెంకటేష్ కేంద్ర బిందువుగా మారారు.
వైసీపీ అనుబంధంగా టీడీపీ ఆరోపణలు
చెవిరెడ్డి అనుచరుడిగా వెంకటేష్ నాయుడు ప్రచారంలో ఉండగా, రెండు రోజుల క్రితం నోట్ల కట్టలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లిక్కర్ డబ్బులను దాచడం, తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే చెవిరెడ్డి సహా వైసీపీ నేతలతో వెంకటేష్‌కు సంబంధాలు ఉన్నాయని మండిపడుతోంది. దీనికి వైసీపీ ప్రత్యుత్తరం ఇస్తూ, విమర్శలపై రివర్స్ ఎటాక్ ప్రారంభించింది.
పలుపార్టీల నేతలతో ఫోటోలు - రాజకీయ దుమారం
వెంకటేష్ నాయుడు కేవలం వైసీపీ నేతలతో మాత్రమే కాదు, టీడీపీ, బీఆర్‌ఎస్ నేతలతో పాటు కేంద్ర మంత్రులతో కూడి ఫోటోలు దిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జగన్‌తో ఫోటోలు కూడా ఆయన తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఫోటోలను చూపిస్తూ టీడీపీ ఆరోపణలపై కౌంటర్ ఇస్తోంది వైసీపీ.
వ్యాపారవేత్తగా వెంకటేష్ - వైసీపీ వాదన
వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందరితోనూ సన్నిహితంగా ఉండేవారని వైసీపీ వాదిస్తోంది. ఆయన వ్యాపారానికి సంబంధించిన నగదునే లిక్కర్ డబ్బుగా ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తోంది. అది నిజంగా లిక్కర్ డబ్బయితే, ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బయితే, రూ. 2 వేల నోట్ల రూపంలో ఎందుకు ఉందని వైసీపీ ప్రశ్నిస్తోంది. కానీ, అధికార పక్షం మాత్రం వెంకటేష్ నాయుడికి వైసీపీతో గాఢ సంబంధాలున్నాయని పట్టుబడుతోంది.
Also Read: మోదీ తర్వాత యోగీనా? బీజేపీలో ఊహించని మార్పులు!
లిక్కర్ స్కాం పక్కకు - “వెంకటేష్ ఎవరి వాడు?” కేంద్ర చర్చ
లిక్కర్ వివాదం కాస్త పక్కకు వెళ్లి, ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎవరి అనుచరుడు అన్నదే ప్రధాన చర్చగా మారింది. “మీ వాడు అంటే మీ వాడు” అంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటుండగా, చివరికి ఆయన ఎవరి వాడో కోర్టులో తేలుతుందని సిట్ స్పష్టం చేస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ వ్యూహం ఏమిటి?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS