IMD Rain Alerts Meaning: భారీ వర్షాలకు వాతావరణ శాఖ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అర్ధం తెలుసా?

IMD Rain Alerts Meaning: వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే సందర్భాల్లో వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తుంది. కానీ ఈ రంగుల అర్థం ఏమిటి? ఏ రంగు ఎలాంటి పరిస్థితిని సూచిస్తుంది అన్నది చాలామందికి అంతుపట్టదు. వాతావరణ పరిస్థితులను స్పష్టంగా తెలియజేయడానికి ఐఎండీ (IMD0-India Meteorological Department) ఈ కలర్ కోడ్స్‌ను అమలు చేస్తుంది.

Yellow Orange Red alert meaning

ఎల్లో అలర్ట్ (Yellow Alert): ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ అలర్ట్ జారీ చేస్తారు. గంట నుంచి రెండు గంటల వ్యవధిలో 7.5 మి.మీ నుంచి 15 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.

ఆరెంజ్ అలర్ట్ (Orange Alert): వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రమైనప్పుడు ఇది జారీ అవుతుంది. వర్షాల కారణంగా రోడ్డు రవాణా, విమాన రాకపోకలకు అంతరాయం, ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తారు.

రెడ్ అలర్ట్ (Red Alert): ఇది అత్యంత ప్రమాద సూచిక. వాతావరణం డేంజర్ లెవెల్‌ దాటే పరిస్థితులు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తారు. ముఖ్యంగా తుఫాన్ల సమయంలో, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post