Jabalpur Sehora Gold Mine: జబల్‌పూర్‌లో భారీ బంగారు నిక్షేపాలు.. భారత ఖనిజ చరిత్రలో కొత్త అధ్యాయం!

Jabalpur Sehora Gold Mine: భారతదేశానికి నిజంగా జాక్‌పాట్ దొరికింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా తహసీల్‌లోని మహాగవాన్-కియోలారి ప్రాంతంలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అధికారికంగా ప్రకటించింది. ఏకంగా వందల ఎకరాల విస్తీర్ణంలో బంగారం మాత్రమే కాకుండా, రాగి మరియు ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని పరీక్షల్లో తేలింది.

Jabalpur Sehora Gold Mine

మహాగవాన్-కియోలారి అంతటా మట్టి నమూనాలు సేకరించి, రసాయన విశ్లేషణలు చేసిన GSI శాస్త్రవేత్తలు 100 హెక్టార్ల పరిధిలో బంగారు నిల్వలు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రాథమిక లెక్కల ప్రకారం, లక్షల టన్నుల పసిడి ఉండే అవకాశం ఉందని తెలిపారు. వాణిజ్యపరంగా ఇది లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ"ఇది ఇటీవలి కాలంలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి" అని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ పూర్తిగా ధృవీకరించబడితే, జబల్‌పూర్ భారతదేశంలోనే అత్యంత ఖనిజ సంపన్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగా జబల్‌పూర్ గోల్డ్‌మైన్ దేశానికి గేమ్‌ఛేంజర్ అవుతుందని అంచనా.

అయితే, ఇంకా పరిశోధన దశ కొనసాగుతూనే ఉంది. "బంగారపు కణాలు కనుగొన్నప్పటికీ, అక్కడ పెద్ద గని ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పేందుకు సమయం పడుతుంది" అని GSI డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా తెలిపారు.

ఈ వార్త వెలువడగానే గ్రామాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ పెద్ద రామరాజ్ పటేల్ మాట్లాడుతూ "మా భూమిలో బంగారు రేణువులు కనిపించాయని తెలిసిన క్షణం నుంచి ప్రజల్లో ఆనందం మితిమీరింది. తవ్వకాల ప్రాంతాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు" అని చెప్పారు.

Also Read: అమెరికా-భారత్‌ వ్యాపార సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలు!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post