CBSE Open-Book Exams:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్ (OBAs) ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో ఈ ఫార్మాట్ సాధ్యాసాధ్యాలపై పైలట్ అధ్యయనం తర్వాత బోర్డు పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్ధులు బట్టీ పట్టే విధానంకి స్వస్తి పలికేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక చట్రం (NCFSE) 2023, జాతీయ విద్యా విధానం (NEP) 2020 లకు సైతం ఈ విధానం అనుగుణంగా ఉంటుందని బోర్డు పేర్కొంది.
![]() |
| CBSE Open-Book Exams |
డిసెంబర్ 2023లో ఆమోదించబడిన పైలట్ ప్రాజెక్ట్ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. 9 నుంచి 12 తరగతులలో ఓపెన్-బుక్ పరీక్షలను అమలు చేసేందుకు అనుమతి తెలిపింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల పనితీరు 12 శాతం నుంచి 47 శాతం వరకు పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇది వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో, ఇంటర్ డిసిప్లినరీ భావనలను అర్థం చేసుకోవడంలో సవాళ్లను అధిగమించేలా చేస్తుంది. దీని ట్రయల్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులు కూడా OBA పరీక్షల గురించి ఆశాజనకంగా స్పందించారు. ఇవి విమర్శనాత్మక ఆలోచనను పెంచే సామర్థ్యాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.
కాగా CBSEలో ఓపెన్-బుక్ అసెస్‌మెంట్ తీసుకురావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ దీనిని అమలు చేశారు. 2014 లో వివిధ సబ్జెక్టులలో 9, 11 తరగతులకు ఓపెన్ టెక్స్ట-బేస్డ్ అసెస్‌మెంట్ (OTBA) ను ప్రవేశపెట్టింది. విద్యార్థులకు పరీక్షలకు నెలల ముందు రిఫరెన్స్ మెటీరియల్స్ అందించారు. అయితే విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడంలో పెద్దగా విజయం సాధించకపోవడంతో దీనిని 2017-18లో నిలిపివేశారు.
Also Read: తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉచిత విద్య అందించే దేశాలు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
