Sky Blue Mushroom in Telangana: వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ తీవ్రంగా దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల బయోడైవర్సిటీ మాత్రమే కాకుండా, అధిక వర్షపాతం, కరువు, తీవ్ర ఎండలు, ముంచెత్తే వరదలు, దట్టమైన మంచు వంటి సమస్యలు ప్రపంచ దేశాలను వేధిస్తున్నాయి. దీని కారణంగా కోట్ల రూపాయల నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తోంది.
![]() |
Sky Blue Mushroom in Telangana |
స్కై బ్లూ మష్రూంలో అరుదైన అజులిన్ వర్ణద్రవ్యం ఉంటుంది. వాతావరణంలో తేమ స్థాయి అధికంగా ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది. న్యూజిలాండ్‌లోని దట్టమైన అడవుల్లో లభించే వాతావరణ పరిస్థితులు కనకగిరి అడవుల్లోనూ ఉండటం వల్లే ఇక్కడ ఇది పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2002లో న్యూజిలాండ్ ప్రభుత్వం విడుదల చేసిన 50 డాలర్ల నోటుపై కూడా స్కై బ్లూ మష్రూం ప్రతిష్టించారు.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ మష్రూం ఒక సాప్రోబిక్ శిలీంధ్రం. ఇది సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తూ అడవిలోని పోషక చక్రానికి దోహదం చేస్తుంది. అయితే, దీనిని పొరపాటున తింటే మాత్రం విషపూరితమవుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మష్రూం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: 30 సంవత్సరాల తర్వాత తిరిగి వికసించిన తామరపూల అసలు స్టోరీ తెలుసా?