August 1947 vs August 2025 Same Dates: ఈ ఏడాది ఆగస్టు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సహజంగానే ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి అదే నెలలో వినాయక చవితి, శ్రావణ మాసం, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు కూడా జరగనున్నాయి. అంతేకాదు, మరో అరుదైన గుర్తింపును ఆగస్టు నెల ఈసారి సాధించింది. 1947 ఆగస్టు క్యాలెండర్‌లో ఉన్న తేదీలు, వారాలు, 2025 ఆగస్టు నెలలోనూ ఒకే విధంగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
![]() |
August 1947 vs August 2025 Same Dates |
భారతీయుడి గుండెచప్పుడు..
1947 సంవత్సరం అంటే ప్రతి భారతీయుడికి మరపురాని జ్ఞాపకం. ముఖ్యంగా ఆగస్టు నెలలో శతాబ్దాల పాటు ఎదురుచూసిన స్వాతంత్ర్యం లభించింది. పరాధీనత నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందిన ఆ క్షణం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. 1947 ఆగస్టు 15న ఈ దేశం కొత్తగా స్వేచ్ఛాస్వాసను పీల్చింది. అందుకే ఆ ఆగస్టు ప్రతి భారతీయుడి గుండె చప్పుడుగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే ఏడాది.. అదే నెల క్యాలెండర్ మరోసారి సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకుంది.
79 సంవత్సరాల తర్వాత..
ఇటీవలే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుభాకాంక్షలు, అభినందనలు విస్తృతంగా పంచుకున్నారు. ఇంతలోనే 1947 ఆగస్టు క్యాలెండర్‌ను 2025 ఆగస్టు క్యాలెండర్‌తో సరిపోల్చుతూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నెలలోని వారాలు, తేదీలు సరిగ్గా ఒకేలా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 79 సంవత్సరాల తర్వాత ఇంతటి పోలిక రావడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS