Rahul Sipligunj Engagement: ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ తెలుగు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు అనూహ్యంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు ఆయన స్నేహితులు సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకోగా, అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.
![]() |
Rahul Sipligunj - Harinya Reddy Engagement Photo |
దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, “కంగ్రాట్స్ బ్రో” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ త్వరలోనే వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన హరిణ్యా రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఆదివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి.
నిశ్చితార్థ వేడుకలో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించగా, హరిణ్యా రెడ్డి నారింజ రంగు లెహంగా లో ఆకట్టుకున్నారు. ఇద్దరూ భలే జోడీగా ఉన్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వీరి పెళ్లి తేదీపై మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, రాహుల్ అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ వేడుకను ఇంత సీక్రెట్‌గా ఎందుకు జరిపారన్న ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో రాహుల్, పునర్నవీల మధ్య ప్రేమ ఉందని, ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై పునర్నవీ స్పష్టతనిస్తూ, రాహుల్ తనకు మంచి స్నేహితుడేనని వెల్లడించారు. ఇక గత కొన్నాళ్లుగా రాహుల్, హరిణ్యా రెడ్డి ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆ తరహాలోనే అనూహ్యంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS