AP Annadata Sukhibhava Scheme 2025: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం.. రైతుల ఖాతాల్లోకి ₹7,000 నేరుగా జమ!

AP Annadata Sukhibhava Scheme 2025: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో శనివారం ప్రకాశం జిల్లా దర్శిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా పథకాన్ని ప్రారంభించి, రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా చెక్కును ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో రైతుకు ₹5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹2,000 చొప్పున మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 2025–26 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడతగా ఈ నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల (RBK) ఆధారంగా అర్హులైన రైతుల జాబితాను తయారుచేసి e-KYC ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం రూ.3,174 కోట్లు రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి.


46.86 లక్షల మంది రైతులకు లబ్ధి

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46.86 లక్షల మంది అర్హులైన రైతులకు మొదటి విడతగా ₹7,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. రైతులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద మూడవ దఫాగా మొత్తం ₹14,000 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది — మొదటి విడతలో ₹5,000, రెండవ విడతలో ₹5,000, మూడవ విడతలో ₹4,000 చొప్పున. గత ప్రభుత్వంలో మూడు విడతలుగా ₹13,500 చెల్లించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదనంగా ₹6,500 చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా వచ్చే ₹6,000 కూడా కలుపుకుంటే, ఒక్క రైతు ఖాతాలో మొత్తం ₹20,000 జమ కానున్నాయి.

Also Read: చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ.. దీర్ఘకాలిక ప్రధానిగా మరో మైలురాయి!

సన్న, చిన్నకారు రైతులకు మేలు

చిన్న, సన్నకారు రైతులు మరియు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, రైతుల ఆర్థిక భద్రతను నిర్ధారించడం అన్నదాత సుఖీభవ పథకం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతులకు CCRC కార్డులు జారీ చేస్తున్నారు. ఈ నిధులు పెట్టుబడి సాయంగా ఉపయోగపడడంతో, రైతులలో ఆనందం వెల్లువెత్తుతోంది.

లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఏమి చేయాలి?

ఈ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయిన లేదా ఖాతాలో డబ్బులు జమ కాకపోయిన రైతులు, తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను (RBK) సంప్రదించాలి. అవసరమైన భూ పత్రాలు, భూమి పట్టాదారు పత్రాలు లేదా కౌలు ఒప్పందం (కౌలు రైతులకు), ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే, అధికారులు వివరాలను పరిశీలించి లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా, e-KYC సాంకేతిక లోపాలు ఉండడం వల్లే డబ్బులు జమ కాకపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల, సమస్యలుంటే వెంటనే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post