Daily Yoga Benefits: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నారు. కెరీర్, ఫ్యామిలీ బాధ్యతలు, డెడ్‌లైన్లు, ట్రాఫిక్, టెన్షన్… ఇలా రోజంతా ఒత్తిడిలో ఉండే పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే అవకాశం కూడా చాలామందికి ఉండటం లేదు. కానీ ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌లోనూ, రోజుకు కేవలం 20 నిమిషాలు యోగా చేసుకుంటే శరీరం ఉత్సాహంగా, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు... ఇది మనిషి శరీరానికి, మనస్సుకు, శ్వాసకు మధ్య సమతుల్యతను తీసుకురావడమే. రోజూ యోగా చేయడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.1. ఒత్తిడి (Stress) మరియు ఆందోళన (Anxiety): శ్వాస వ్యాయామాలు (ప్రాణాయామం), ధ్యానం, మరియు యోగా ఆసనాలు మనలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తాయి. ఫలితంగా మనసు ప్రశాంతంగా మారుతుంది.
2. నిద్రలేమి (Insomnia): రోజూ యోగా చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నైట్ టైం యోగా లేదా శవాసనం వంటివి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
3. జీర్ణక్రియ సమస్యలు: పవనముక్తాసనము, అర్ధమత్స్యేంద్రాసనము లాంటి ఆసనాలు గ్యాస్, bloating, అజీర్ణం లాంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి.
4. బరువు పెరగడం (Weight Gain): యోగా శరీరాన్ని only flexible గా కాక, energetic మరియు active గానూ ఉంచుతుంది. అలాగే metabolism ని బూస్ట్ చేస్తుంది, ఫలితంగా బరువు నియంత్రణలోకి వస్తుంది.
5. PCOD మరియు హార్మోన్ సమస్యలు: కొంతమంది మహిళలకు యోగా వల్ల హార్మోన్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. ఇది PCOD, థైరాయిడ్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వంటి సమస్యల్లో సహాయపడుతుంది.
6. ఆత్మవిశ్వాసం: ధ్యానం ద్వారా మైండ్ ఫోకస్ పెరుగుతుంది. దానితో పాటు, ప్రతి ఆసనం మన శరీరంపై మనకి నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఈ రెండూ కలిస్తే, మన day-to-day పనుల్లో మనం confident గా వ్యవహరిస్తాము.
Also Read: నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. రోజూ కొద్దిగా సమయం కేటాయించి యోగా సాధన చేయడం వల్ల మన జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా మారుతుంది. నేడు ప్రారంభించండి… ఆరోగ్యంగా జీవించండి.Also Read: మహేష్ బాబు డైట్ ప్లాన్
For more updates follow us on V Health Official