Modi Master Plan for Pawan Kalyan: పవన్ సీఎం కావడానికి మోడీ స్ట్రాటజీ? ప్రకాష్ రాజ్ ట్వీట్‌తో కలకలం!

Modi Master Plan for Pawan Kalyan: సినీ నటుడు ప్రకాష్ రాజ్ తరచుగా లాజికల్‌గా, ట్విస్టులతో వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా అలాంటిదే. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇరకాటంలో పెట్టే ప్రకాష్ రాజ్, ఈసారి మాత్రం పవన్ భవిష్యత్తులో పొందబోయే పదవిపై పరోక్షంగా స్పందించారు.

Modi Master Plan for Pawan Kalyan

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలు శిక్ష అనుభవించే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా నెల రోజులపాటు జైలులో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ బిల్లుపై బిజెపి వ్యూహాలు ఏంటి అన్నదానిపై ప్రజల్లో చర్చ జోరందుకుంటున్న వేళ, ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

బిల్లుపై విపక్షాల తీవ్ర వ్యతిరేకత

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ బిల్లుకు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎలాగైనా ఆమోదం పొందేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, విపక్ష ప్రభుత్వాలను బలవంతంగా కూలదోసి అధికార మార్పిడి కోసం బిజెపి ఈ బిల్లును తెస్తోందని మండిపడుతోంది.

Pawan Kalyan and Prakash Raj
Pawan Kalyan and Prakash Raj

దేశవ్యాప్తంగా ఓట్ల దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తోన్న సమయంలోనే ఈ బిల్లును తెచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన అధికార యాత్ర హాట్ టాపిక్‌గా మారిన సమయంలో దృష్టి మళ్లించేందుకే బిజెపి ఈ ప్రయత్నం చేస్తోందన్న అనుమానం కూడా విపక్షాల్లో ఉంది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.


ఏపీలో మూడు పార్టీల కూటమి

ఇటీవలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొదట బిజెపితో జనసేన జత కట్టగా, తర్వాత క్షేత్రస్థాయి బలంతో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని పోటీ చేయాలని నిర్ణయించారు.

Narendra Modi and Prakash Raj
Narendra Modi and Prakash Raj

ఈ కూటమి అద్భుత విజయాన్ని సాధించి, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు స్వీకరించారు. బిజెపి కూడా అధికారంలో భాగమైంది. అయితే భవిష్యత్తులో జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి ఆలోచిస్తోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను ఉటంకిస్తూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ చేశారు.

"ఒక చిలిపి సందేహం..." - ప్రకాష్ రాజ్

"ఒక చిలిపి సందేహం" అంటూ తన ట్వీట్‌ను ప్రారంభించిన ప్రకాష్ రాజ్, "మహాప్రభు తీసుకువస్తున్న ఈ కొత్త బిల్లువెనుక... మాజీ ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, తమ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేయాలన్న కుట్ర ఏమైనా ఉందా?" అని ప్రశ్నించారు.

Chandrababu, Narendra Modi and Pawan Kalyan
Chandrababu, Narendra Modi and Pawan Kalyan 

ఈ వ్యాఖ్యలతో ఆయన చంద్రబాబు, జగన్ అడ్డంకులను తొలగించి, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న యత్నమా అన్న సంకేతం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. 


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post