Krishna Godavari Water Issue: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేదికల మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినా, వేదికల పైన మాటల తూటాలు మాత్రం తారాస్థాయికి చేరాయి. గోదావరి-కృష్ణా జలాల అంశం మళ్లీ వేడెక్కింది.
![]() |
| Telangana CM Revanth Reddy Vs Andhra Pradesh CM Chandra Babu Naidu |
ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు: విజయవాడలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎటువంటి అభ్యంతరం ఉండకూడదని స్పష్టం చేశారు. సముద్రంలో వృథా అవుతున్న వరదనీటినే వినియోగించబోతున్నామని, ఇది రెండు రాష్ట్రాలకూ నష్టాన్ని కలిగించదని వివరించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద వల్ల నష్టాలు భరిస్తున్నామన్నారు. “వరదను భరించాలి కానీ, ఆ నీటిని వాడుకోకూడదా?” అని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్: హైదరాబాద్ గోల్కొండ కోట వేదికగా జెండా ఎగరేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి వాటాల సాధనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, వాటిని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని తేల్చి చెప్పారు. కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తప్పకుండా దక్కించుకుంటామని చెప్పారు.
ఈ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న నీటి వివాదం మరోసారి ముదిరింది. ప్రాజెక్ట్‌లపై, వాటాలపై, వ్యూహాలపై ఇరు రాష్ట్రాలు సడలింపు చూపే సూచనలు లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత వేడెక్కే అవకాశం ఉంది.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

