Ancient Friendship Stories: పురాణాల్లోని అద్భుతమైన స్నేహ బంధాలు - మనకు చెప్పే జీవిత పాఠాలు!

Ancient Friendship Stories: “స్నేహానికన్న మిన్న లోకాన లేదుర కన్నా” అనే పాట ఎంత నిజమో, జీవితంలో కూడా అదే అనుభవం కలుగుతుంది. స్నేహం అనేది మనం కావాలనుకుని ఏర్పరచుకునే సంబంధం కాదు… అది స్వయంగా కలిసివచ్చే అనుబంధం. కాలం, వయస్సు, స్థానం అనే అడ్డంకులన్నీ దాటి హృదయాలను కలిపే అనిర్వచనీయమైన అనుబంధమే స్నేహం. ఈ బంధం నేటికీ మాత్రమే పరిమితం కాదు… పురాణాలు, ఇతిహాసాల కాలంలోనూ ఎంతో విలువైన స్నేహాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకంగా త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు గొప్ప స్నేహితులు ఎందరో మనకు తెలియజేస్తారు.

Friendship between Sugriva and Lord Rama

శ్రీరాముడు - సుగ్రీవుడు: త్రేతాయుగంలో శ్రీరాముడు సీత కోసం వెతుకుతూ కిష్కింద ఖండానికి చేరుకుంటాడు. అక్కడ సుగ్రీవుడు అనే వానరుడితో స్నేహబంధం ఏర్పడుతుంది. హనుమంతుడు వీరిద్దరినీ పరిచయం చేస్తాడు. ఈ స్నేహానికి పరస్పర సహాయమే పునాదిగా నిలుస్తుంది. సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని రామునికి సహాయంగా పంపితే, రాముడు సుగ్రీవుని శత్రువు వాలిని సంహరిస్తాడు. అటు వ్యక్తిగత అవసరం… ఇటు ధర్మమార్గంలో నిలిచిన మాట… ఈ ఇద్దరి స్నేహం ఆదర్శంగా నిలిచింది.

Friendship between Kuchela and Lord Krishna

కృష్ణుడు - కుచేలుడు: ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేళుని మరచిపోలేదు. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న కుచేలు భార్య అభ్యర్థనపై కృష్ణుణ్ని కలవడానికి ద్వారకకు వస్తాడు. అపార ఐశ్వర్యంతో కూడిన ద్వారకలోకి అడుగుపెట్టిన కుచేలను, కృష్ణుడు హర్షభరితంగా ఆహ్వానించి అతని పాదాలను స్వయంగా కడుగుతాడు. తన స్నేహితుడికి రాచ మర్యాదలు ఇచ్చి, అతని గౌరవాన్ని నిలబెట్టాడు. ఇది కేవలం అపురూపమైన స్నేహమే కాదు.. ఓ రాజధీరుడి నైతిక విలువలకి ప్రతిబింబం కూడా.

Friendship between Arjun and Lord Krishna

కృష్ణుడు - అర్జునుడు: భగవద్గీతలో స్నేహానికి మరో రూపం కనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి సారధిగా మారి, కురుక్షేత్ర యుద్ధ భూమిలో ధర్మం యొక్క మార్గాన్ని వివరించటం ద్వారా అతని జీవన పథాన్ని మారుస్తాడు. అర్జునుడికి నిస్సాహాయత కలిగిన సమయంలో స్నేహితుడిగా, గురువుగా మారి, ధర్మాన్ని నిగ్రహించాలన్న తత్వాన్ని అలవరచేలా చేస్తాడు. ఇది స్నేహం అంటే కేవలం తోడుగా ఉండటం కాదు… అవసరమైన సమయంలో మార్గదర్శిగా నిలబడటమనే గొప్ప ఉదాహరణ.

Friendship Between Karna and Duryodhana

కర్ణుడు - దుర్యోధనుడు: కర్ణుడు - దుర్యోధనుడి స్నేహం చారిత్రకంగా ఎంతో చర్చనీయాంశమైంది. కర్ణుని సామర్థ్యం గుర్తించి, అతన్ని తన సమానస్థాయిలో ఆదరించి, రాజ్యాధికారం వరకూ చేర్చిన దుర్యోధనుడు అతని పట్ల ఉన్న నిజమైన మమకారానికి నిదర్శనం. అటు కర్ణుడు కూడా చివరి శ్వాస వరకు దుర్యోధనుడికి విధేయుడిగా ఉండడం… వారి స్నేహాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది. ఇది నిబద్ధత, నమ్మకం కలిగిన స్నేహానికి పరాకాష్టగా నిలుస్తుంది.

స్నేహం - శాశ్వతమైన సాంప్రదాయం: ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తున్నవి ఏంటంటే.. స్నేహం అనేది కాలాన్ని, పరిస్థితులను, బలహీనతలను దాటి నిలిచే బంధం. స్నేహితుడు అనేవాడు మనతో నవ్వే వ్యక్తి మాత్రమే కాదు… అవసరంలో పక్కన నిలిచే ఆదరణ. పురాణ స్నేహాల కథలు ఆధునిక జీవితంలో మనం తీసుకోవాల్సిన విలువైన పాఠాలు. నిజమైన స్నేహం స్వార్థాన్ని మరిచి, హృదయాలను కలిపే పవిత్రమైన అనుబంధం.

Also Read: అష్టదిక్పాలకులు అంటే ఎవరు?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post