Roasted Corn Benefits: వేడి వేడి మొక్కజొన్న ఉంటే ఆ అనుభూతి ఎప్పటికీ మరవలేనిది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందికి మొక్కజొన్న అంటే ప్రేమ. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు… బీచ్‌ల దగ్గరనో, రోడ్ సైడ్‌లోనో కాల్చిన మొక్కజొన్న తప్పనిసరిగా తింటారు. కానీ ఈ మొక్కజొన్న రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి చేసే మేలూ ఎంతో ప్రత్యేకం.
రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన ఆహారం
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. అలా అనారోగ్యానికి గురవ్వకుండా ఉండాలంటే మొక్కజొన్న ఓ మంచి ఆయుధంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ C, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడతాయి. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.
మూత్రపిండాల రాళ్లకు మాయ చేసే సహజ ఔషధం
చాలామందికి రాగానే భయపడే సమస్య మూత్రపిండాల్లో రాళ్లు. అయితే తరచూ కాల్చిన మొక్కజొన్న తినడం మూత్రాన్ని శుభ్రపరిచే విధంగా పని చేస్తుంది. దీని diuretic properties మూత్ర విసర్జనను మెరుగుపరిచి, కిడ్నీలను డీటాక్స్ చేస్తాయి. దాంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
గుండెకు సపోర్ట్
మొక్కజొన్నలో ఉండే ఫైబర్, పొటాషియం, మాగ్నీషియం లాంటి పోషకాలతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది కోలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి, హృదయ సంబంధిత సమస్యలు దూరంగా ఉంచడంలో కీలకంగా మారుతుంది. ముఖ్యంగా వయసు పైబడినవారు వర్షాకాలంలో మొక్కజొన్నను ఆహారంగా తీసుకుంటే మరింత మేలు.
జీర్ణవ్యవస్థకు తోడుగా, ఒత్తిడికి గుడ్‌బై
వర్షాకాలం స్నాక్స్ తినాలని ఎప్పుడూ మానసికంగా మనసు కోరుకుంటుంది. అలాంటి వేళలో మొక్కజొన్న తింటే రుచి తో పాటు ఆరోగ్యం కూడా. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచి గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అంతే కాదు, మొక్కజొన్న ఒత్తిడిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: కంద దుంప తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మరిన్ని Latest Health Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V Health