Beetroot Side Effects: బీట్‌రూట్ అనగానే మనం దానిని ఒక సూపర్‌ఫుడ్‌గానే పరిగణిస్తాం. ఇది రక్తాన్ని పెంచుతుందని, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని చాలామంది నమ్ముతారు. ఇందులో ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ప్రతి మంచి విషయంలోనూ కొన్ని మినహాయింపులు తప్పవు. అన్ని ఆరోగ్య పరిస్థితులకూ బీట్‌రూట్ మంచిది అని అనుకోవడం పొరపాటే.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జాగ్రత్త
బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్‌ను అధికంగా తినకూడదు. ఇది అలెర్జీ సమస్యలకూ కారణమవుతుంది.
తక్కువ రక్తపోటుతో బాధపడేవారికి హానికరం
బీట్‌రూట్‌లో నైట్రేట్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, రక్తపోటు మరింత తగ్గిపోవచ్చు. హైపోటెన్షన్ ఉన్నవారిలో తల తిరగడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కనుక, మీ బిపి లెవెల్స్ తక్కువ ఉన్నవారు బీట్‌రూట్ తినే విషయంలో రెండు సార్లు ఆలోచించాలి.
మధుమేహం ఉన్నవారూ జాగ్రత్తపడాలి
బీట్‌రూట్‌లో సహజ చక్కెర తక్కువగా ఉన్నా, గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం మీడియం నుంచి హై రేంజ్‌లో ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రతిసారీ వైద్యుని సూచన మేరకు తీసుకోవడం ఉత్తమం.
అలెర్జీలు ఉన్నవారికి వెంటనే వైద్యుడిని కలవాలి
కొంతమందికి బీట్‌రూట్ తినగానే చర్మ సమస్యలు, గ్యాస్, విరేచనాలు, అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఈ రకమైన ప్రతిచర్యలు కనిపిస్తే వెంటనే బీట్‌రూట్ తీసుకోవడం ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ ఒకేలా పనిచేయదని గుర్తుంచుకోవాలి.