Aristotle on India: అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్రకు రావాలని నిచ్ఛయించుకున్నప్పుడు, మొదట తన గురువు అరిస్టాటిల్‌కి ఈ విషయం చెప్పాడు. కానీ అరిస్టాటిల్‌కి అది సంతృప్తికరంగా అనిపించలేదు. "భారతదేశం ఓ పవిత్ర భూమి, ఆ సంస్కృతిని అర్థం చేసుకోలేకపోతే ఓడిపోతావు" అని తన శిష్యుడిని హెచ్చరించాడట. అలాంటి దేశం జోలికి వెళ్ళకూడదని గట్టిగా చెప్పాడట. అయినా కూడా అలెగ్జాండర్ పట్టువదలకుండా, తన గురువుని ఒప్పించాడు. బయలుదేరే సమయంలో అడిగాడు “మీకు అక్కడి నుంచి ఏదైనా కావాలా?” అని.
అప్పుడే అరిస్టాటిల్ ఏం కోరాడో తెలుసా? “నాకు భారతదేశపు గుప్పెడు మట్టి కావాలి, గంగానది నుండి గుక్కెడు నీళ్లు కావాలి, రామాయణం కావాలి, మహాభారతం కావాలి, అలాగే అక్కడి నుండి ఓ గురువుని తీసుకురావాలి,” అన్నాడట. అలెగ్జాండర్ ఈ మాటలు విని నిజంగానే ఆశ్చర్యపోయాడు. “ఇవన్నీ సాధారణమైనవి కదా..?” అని ప్రశ్నగా చూసాడు. అరిస్టాటిల్ మౌనంగా నవ్వుతూ చెప్పాడు “ఇవన్నీ పరమ పవిత్రమైనవి. జాగ్రత్తగా తీసుకొని రా,” అని.
ఈ మాటలు విన్న అలెగ్జాండర్ కి ఏదో తెలియని గౌరవభావన కలిగిందట. ఎందుకంటే తన గురువు ప్రపంచజ్ఞానంలో అగ్రగామి. అలాంటి వాడే భారతదేశం గురించి అంత పవిత్రమైన అభిమానం చూపడమంటే, చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించిందట. భారతదేశాన్ని జయించడం కన్నా, దానిని అర్థం చేసుకోవడమే నిజమైన విజయం అనే భావన అతని మనసులో తొలిసారి ఆవిర్భవించింది.
Also Read: అభయ రాణి అబ్బక్క చౌతా - తొలి స్వాతంత్ర పోరాట యోధురాలు.!
ఇది నిజం గాథ కాదు కావచ్చు. కానీ ఇందులోని సారాంశం అమూల్యమైనది. భారతదేశం కేవలం ఓ దేశం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక తపోవనం. రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలు కేవలం కథలు కాదు.. అవి జీవితాలను మార్గనిర్దేశం చేసే జ్ఞానదీపాలు. గంగానది కేవలం నీటి ప్రవాహం కాదు.. అది పవిత్రతకి పర్యాయపదం. భారతదేశపు మట్టి ఓ చరిత్ర. ఈ విలువలను అరిస్టాటిల్ గుర్తించడం మనకెంతో గర్వకారణం.
మన కళ్లముందే ఉన్న ఈ సాంస్కృతిక సంపదను మనమే ఎన్నడూ చిన్నచూపు చూడకూడదు. ప్రపంచమే మన దేశాన్ని గౌరవించడాన్ని మనం గుర్తించాలి. భారతదేశం అనేది ఒక భౌగోళిక గమ్యం మాత్రమే కాదు.. అది జీవన తత్వం. అలెగ్జాండర్ లాంటి వీరుడు భారతదేశం గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం మాత్రం ఎందుకు మరచిపోవాలి? మన గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. గౌరవించాలి. రక్షించాలి.
Also Read: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS