Akhil Akkineni: అఖిల్ పెళ్లిపై నెటిజన్ల సెటైర్లు.! అలా చేసినందుకేనా?

Akhil Akkineni: ఇటీవల అక్కినేని కుటుంబంలో ఓ శుభకార్యం జరగడం తెలిసిందే. జూన్ 6న నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని, జైనబ్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఘనంగా రిసెప్షన్‌ కూడా నిర్వహించారు.

ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం నాగార్జున సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా, చైతూ కూడా తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేశాడు. అయితే అఖిల్ మాత్రం తాను పెళ్లైన ఫొటోలు పోస్ట్ చేయకుండా మౌనంగా ఉన్నాడు.

పెళ్లి జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత, అఖిల్ చివరికి తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫొటోలు అభిమానులతో పంచుకుంటూ, “నా జీవితంలో అత్యుత్తమమైన రోజును మీతో పంచుకుంటున్నాను” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఆలస్యంపై నెటిజెన్లలో కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. “ఇప్పుడు పెళ్లయిందని చెబుతున్నారా?” అని చమత్కరిస్తున్నారు. అఖిల్ షేర్ చేసిన ఫొటోలలో నాగ చైతన్య, శోభిత లు కనిపించకపోవడం గమనార్హం.

Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.! బేబీ ఫోటో, పేరు షేర్ చేసిన నటి

జైనబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ కుమార్తెగా, వేల కోట్ల ఆస్తుల వారసురాలు అని సమాచారం. ఆమె అఖిల్ కంటే 9 సంవత్సరాలు పెద్దదని చెబుతున్నారు. వ్యాపార సంబంధాల ద్వారా అఖిల్-జైనబ్‌ల పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్టు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిపినట్టు తెలుస్తోంది.

ఇక అఖిల్ ప్రస్తుతం “లెనిన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో రూపొందుతోంది. మొదట శ్రీలీలను హీరోయిన్‌గా ఎంచుకున్నప్పటికీ, డేట్స్ కుదరకపోవడంతో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నట్టు సమాచారం.

Also Read: టీటు సింగ్ పునర్జన్మ కథ

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post