Vidadala Rajini Biography: "టీడీపీ పెట్టిన మొక్క… జగన్ నీరుపోసిన చెట్టు… ఇప్పుడు పవన్ అన్న వైపు మొగ్గుచూపుతుందా?" రాజకీయాల్లో బలమైన పట్టు సంపాదించుకున్న విడదల రజినీ పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య మహిళగా తన కెరీర్ ప్రారంభించిన రజిని, రాజకీయాల్లో ఎలా ఎదిగింది? గురువుని ముంచిన శిష్యురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె… జగన్‌కి చెల్లెమ్మగా ఎలా మారింది? లావు కృష్ణదేవరాయలతో ఉన్న విభేదాలు, సజ్జలతో ఉన్న సాన్నిహిత్యం, ACB కేసులు, పార్టీ మారే ఊహాగానాలు… వీటన్నిటిపై మీకు స్పష్టత ఇచ్చే ప్రయత్నమే ఈ వీడియో. పూర్తి జీవితం, పొలిటికల్ జర్నీ, కాంట్రవర్సీస్... విడదల రజిని గురించి తెలియాల్సిన ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. వీడియో చివరివరకు చూసేయండి..
వందల కోట్ల ఆస్తి ఉన్న తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తిస్తుందని చెబుతారు విడదల రజిని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. తన మాట తన దూకుడుతో ఎమ్యెల్యేగా గెలుపొంది.. అనతికాలంలోనే జగన్ క్యాబినేట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ అసలు లేదు. కానీ, అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. ఎమ్యెల్యేగా గెలుపొంది.. ఆ తరువాత మంత్రి అయ్యారు.
వ్యక్తిగత జీవితం:
1990 జూన్ 24న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు విడదల రజిని. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత అంటే 2011లో సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి.పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకలోని చిత్రదుర్గంలో జయమై ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బిఈ పట్టా అందుకున్న ఆమె ఆ తర్వాత ఎంబీఏ చేశారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆమె చదువు పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. ఈ సమయంలో ఆమెకి విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరూ పిల్లలు. అమెరికాలో స్థిరపడ్డ వీరు అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి.. వందల మందికి ఉపాధి కల్పించారు.
సమాజ సేవ - పొలిటికల్ ఎంట్రీ:
ఆర్థికంగా స్థిరపడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజా సేవ చేయాలని భావించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించారు భర్త కుమారస్వామి. ఇలా 2014 ఎన్నికల సమయంలో చాలా మంది ఎన్నారైలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజిని కూడా సపోర్ట్ చేశారు. ఈ తరుణంలో విడుదల రజిని 2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె వి.ఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ను ప్రారంభించి పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. చిలకలూరిపేట ప్రజల్లో కలిసిపోయారు రజిని.
మరోవైపు.. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆమె సత్తాను గుర్తించిన ప్రతిపాటి పుల్లారావు 2017లో విశాఖపట్నంలోని మహానాడులో విడదల రజినితో మాట్లాడించారు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడదల రజిని అందర్ని అట్రాక్ట్ చేసింది. ’హైదరాబాదులోని సైబరాబాద్ లో మీరు నాటిన ఈ మొక్క’ అంటూ రజిని చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సభ వేదికపై నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలను నరకాసురులు అంటూ అభివర్ణించింది విడదల రజిని.
ఆనాడు ఆమె మాట్లాడిన మాటల వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీలోనే కాదు తెలుగింట రజిని ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇలా ఓవర్ నైట్ సార్ట్ గా మారిన ఆమె ... తనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, తాను విఆర్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తనకు చిలకలూరిపేట నుంచి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరరామె. కానీ, అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వాలనేనని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ సరైన వేదిక కాదని భావించారు.
Also Read: తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు బయోగ్రఫీ
వైసీపీలో చేరిక
ఈ తరుణంలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజిని. పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలని భావించారు. పాదయాత్ర సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె వైసిపి కండువా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టిడిపి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే.. 2022 ఏప్రిల్ 11 జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల రజిని తన మంత్రివర్గంలో తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచితే సరిపోదని ప్రజల తోడు కూడా ఉండాలని నిరూపించిందమె. బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవరత్నాలు, టిడిపి పై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఇంకా బలంగా తీసుకువెళ్లి తన గెలుపునకు బాటలు వేసుకోవడంలో రజిని వంద శాతం సఫలీకృతులయ్యారు. దీంతోపాటు రజనీ గెలుపునకు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యేగా అయి.. విడుదల రజిని చరిత్ర సృష్టించారు. ఆమె ఆర్యోగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేశారు. మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె వైద్య ఆరోగ్య రంగంలో రెండు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
2024 ఎన్నికలు - పరాజయం, వివాదాలు
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విడదల రజిని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థి గల్లా మాధవి చేతిలో ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, విడదల రజిని వివాదాల్లో చిక్కుకున్నారు.
స్టోన్ క్రషర్స్ కేసుకు సంబంధించి కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఇక వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయ మరియు విడదల రజిని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లావు కృష్ణదేవరాయలు ఓ ఇంటర్వ్యూలో, “రజినీ తన రాజకీయ గురువుని మోసం చేసింది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత స్థాయిలో ఆమెను విమర్శిస్తూ, రాజకీయానికి తగిన నైతిక విలువలు పాటించలేదంటూ విమర్శించాడు. ఇది ఆమె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికపైకి తెచ్చేలా మారింది.
వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యనాయకుల్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఒకరు. పార్టీ వ్యూహాలు, ముఖ్య నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకం. రజినీపై జగన్ నమ్మకంతో పాటు, సజ్జలతో సాన్నిహిత్యంతో కూడా ఆమెకి పదవులు, అవకాశాలు వచ్చాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. తాను కూడా సజ్జల సలహాలు వినడంలో ఆసక్తి చూపిందని అంటారు.
రజిని, ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి సహాయంతో, పవన్ కళ్యాణ్ ని కలవడానికి ప్రయత్నించిందని వస్తున్న వార్తలు పార్టీ మారే ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. అయితే అధికారికంగా ఆమె ఈ విషయంపై స్పందించలేదు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి, ఇది ఖచ్చితంగా తెలియాలంటే వేచి చూడాలి.
ఇలా మొదట్లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న విడదల రజిని ప్రస్తుతం రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. ఎన్నికల్లో పరాజయం, అవినీతి ఆరోపణలు ఆమె భవిష్యత్‌పై ప్రశ్నార్థకాన్ని మిగిలిస్తున్నాయి.
Also Read: వల్లభనేని వంశీ బయోగ్రఫీ
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS