జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచేదేవరు?

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పై దృష్టి పెట్టాయి. దీంతో రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలుకానుంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ బలాలు బేరీజువేసుకుంటూ, ఉపఎన్నికలో బలమైన అభ్యర్థిని వెతికె పనిలో ఉన్నారు.టికెట్ ఆశవహులు సైతం తమ పార్టీల అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

కాంగ్రెస్ టికెట్ రేసులో విజయరెడ్డి, అజరుద్దీన్, నవీన్ యాదవ్, ఫెరోజ్ ఖాన్

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గెలిచి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి గ్రేటర్ లో ఖాతా తెరిచింది. అదే ఊపును  కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ లో సత్తా చాటాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరికొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అందులో మంచి ఫలితాలు సాధించాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లే నేతకే టికెట్ ఇవ్వాలని యోచిస్తుంది.

కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నేతల మధ్య టికెట్ వార్ నడుస్తుంది. నాకంటే నాకు టికెట్ కావాలని అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు పలువురు నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోటి చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. పీజేఆర్ కుమార్తె కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆశీస్సులు తనకే ఉన్నాయని, టికెట్ తనకే వస్తుందని ఇప్పటికే ప్రచారాన్ని కూడా విజయ రెడ్డి మొదలుపెట్టారు. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నారు. నాంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. 

సిట్టింగ్ సీటు ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్.

గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేసిన బీఆర్ఎస్ పార్టీ, ఈ ఉపఎన్నికల్లో సైతం తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని యోచిస్తుంది. త్వరలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు కూడా ఈ ఎన్నిక కీలకమే. అందుకే కాంగ్రెస్ డీకొట్టె అభ్యర్థి వేటలో బీఆర్ఎస్ ఉందట. మాగంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోటికి ముందుకు వస్తే టికెట్ వారికే ఇవ్వాలని, వాళ్ళు కాకుంటే బలమైన అభ్యర్థి ని దింపాలని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట. 

మాగంటి కుటుంబానికి కాకుండా టికెట్ బయటి వారికి ఇస్తే, తమకే టికెట్ ఇవ్వాలని కొంతమంది నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు టికెట్ కోసం రేసులో ఉన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన అధినేత కెసిఆర్ ఎవరికీ ఇవ్వాలో వారికే ఇస్తారని బీఆర్ఎస్ నేతలే పెదవి విరుస్తున్నారు.

బీజేపీ కొత్త అధ్యక్షులు రాంచందర్ రావ్ కి సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన రామ్ చందర్ రావు కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  అనేది సవాల్ గా మారనుంది. ఇప్పటికే బీజేపీ లో టికెట్ కోసం ఫోటి నెలకొంది. ఒకవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి, మరోవైపు హైదరాబాదు ఎంపీగా పోటీ చేసిన మాధవి లత టికెట్ నాకే అంటే నాకు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. 

మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే ప్రతిష్టంబన ఇప్పుడు తొలగిపోవడంతో, బిజెపిలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎవరు అనే ప్రతిస్తంభన  మొదలైంది. మాధవిలత, లంకల దీపక్ రెడ్డి లతో పాటు జంటూరి కీర్తి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, అట్లూరి రామకృష్ణ వంటి నేతలు టికెట్ కోసం ఫోటి పడుతున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లిం, సినీ కార్మికుల ఓట్లు కీలకం.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లు, సినీ కార్మికులు, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో వారి మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.

కాంగ్రెస్ కు MIM మద్దతు.. బీజేపీ కి టిడిపి, జనసేన మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉండడంతో, ఎంఐఎం పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తుందా లేక అధికార కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎం పార్టీ, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి  MIM మద్దతు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్ర సెటిలర్లు,  సినీ కార్మికుల ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎక్కువగా ఉండటంతో బిజెపి వారి మద్దతు కూడగట్టేందుకు టిడిపి, జనసేన సహాయం తీసుకునే అవకాశం కనబడుతుంది. అవసరమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.












Post a Comment (0)
Previous Post Next Post