Tipu Sultan: ప్రపంచ యుద్ధ చరిత్రను మార్చిన భారతీయుడిగా నిలిచిన వ్యక్తి టిప్పు సుల్తాన్. ప్రపంచంలో మొదటిసారిగా లోహంతో తయారైన రాకెట్లను యుద్ధంలో వినియోగించిన దేశం భారత్. బ్రిటిష్‌లు, నెపోలియన్ యుద్ధాల్లో రాకెట్లు ఉపయోగించకముందే… మైసూరు పులి టిప్పు సుల్తాన్ తానే స్వయంగా రూపొందించిన ఇనుప రాకెట్లు 2 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండేవి.
ఈ రాకెట్లతో ఆయన బ్రిటిష్ సైన్యంపై దాడులు చేసి వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. బ్రిటిష్‌లు టిప్పు సుల్తాన్ రాకెట్లను చూసి షాక్‌కు గురై… వాటిని ఇంగ్లాండ్‌కి తీసుకెళ్లి అధ్యయనం చేసి, 'కాంగ్రీవ్ రాకెట్' అనే తమ స్వంత రకాన్ని అభివృద్ధి చేశారు. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ కాలంలోనే ఈ రాకెట్లకు పునాది పడినప్పటికీ, వాటిని శాస్త్రీయంగా అభివృద్ధి చేసి, ప్రథమంగా ‘రాకెట్ బ్రిగేడ్’ అనే ప్రత్యేక యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు టిప్పు.
ఆయనే మొదటిసారిగా సైన్యంలో ప్రత్యేకంగా రాకెట్ వింగ్‌ను రూపొందించారు. శిక్షణ పొందిన సైనికులతో శత్రు శిబిరాలపై ఈ రాకెట్లు ప్రయోగించి, శక్తివంతమైన దాడులు చేశారు. ఇవే చరిత్రలో మొదటి "మిలిటరీ గ్రేడ్ గైడెడ్ వెపన్స్"గా పరిగణించబడతాయి. టిప్పు సుల్తాన్ మరణానంతరం ఆయనే తయారు చేసిన రాకెట్లు బ్రిటిష్‌ల చేతుల్లోకి వెళ్లాయి. ఇంగ్లాండ్‌కి తీసుకెళ్లిన తర్వాత వాటిపై లోతైన అధ్యయనం జరిపారు.
టిప్పు సాంకేతికత ఆధారంగా విలియం కాంగ్రీవ్ అభివృద్ధి చేసిన రాకెట్లు తరువాత నెపోలియన్ యుద్ధాల్లో, అమెరికా-బ్రిటన్ యుద్ధాల్లో కీలకంగా ఉపయోగించబడ్డాయి. అనగా, భారతదేశం నుంచే పుట్టిన మిలిటరీ సాంకేతికతే ప్రపంచ యుద్ధాల దిశను మలిచిందని చరిత్ర చెబుతోంది. ఆధునిక యుద్ధరంగానికి దారితెరిచిన అసలైన విజ్ఞానవేత్త టిప్పు సుల్తాన్‌ను మనం మరచిపోకూడదు.
Also Read: న్యూస్ పేపర్ పై ఈ రంగుల చుక్కలెందుకు?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS