తెలంగాణ బీజేపీ లో బీసీలకు న్యాయం జరుగుతుందా?

ఎన్నికల ముందు బీసీ సీఎం.. ఎన్నికలయ్యాక బీసీల చెవిలో పువ్వు

తెలంగాణ బీజేపీలో బీసీ నేతల స్థానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నాయకత్వం వంటి కీలక నియామకాల్లో బీసీలకు న్యాయం జరగలేదన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. గత ఎన్నికల సందర్భంగా బీసీ సీఎం నినాదంతో ప్రజల్లో విశ్వాసం కలిగించిన బీజేపీ, ఆ తర్వాత మాత్రం బీసీలను పక్కనపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రేసులో ఈటల, ఆచారి, అరవింద్.. కానీ చివరకు!

గత కొన్ని వారాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపించింది. అలాగే తల్లోజు అచారి, ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లాంటి నేతల పేర్లూ చర్చలో ఉన్నాయి. అయితే చివరికి బ్రాహ్మణ వర్గానికి చెందిన రాంచందర్ రావ్ ని అధిష్ఠానం ఎంపిక చేసింది. దీనిపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా పైకి చెప్పకపోయినా బీజేపీ లో ఉన్న బిసి నేతలంతా ఎప్పుడు లేనంత అసంతృప్తి లో ఇప్పుడు ఉన్నారు. రాజాసింగ్ లాంటి నేతలు బహటంగానే పార్టీపై విమర్శలు చేసినా, బీజేపీ లోని బిసి నేతలంతా బయటకి చెప్పకపోయినా లోలోపల మదనపడుతున్నారని తెలుస్తుంది.

అంతే కాకుండా బీజేపీ శాసనసభపక్ష నేత ఎంపికలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన ఉంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ని కాకుండా, కాంగ్రెస్ పార్టీ మూలలు కలిగి, బీజేపీ నుండి తొలిసారి గెలిచిన, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి బీజేఎల్పి నేతగా అవకాశం కల్పించారు. ఒకవేళ రాజాసింగ్ కు ఇవ్వకపోతే బిసి నేత అయిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి అయినా అవకాశం ఇవ్వాలనేది బిసి నేతల వాదన. 

రాజసింగ్ ని లైట్ తీసుకున్న అధిష్టానం!

బీజేపీ లో బిసి నేతలకు అవకాశం ఇవ్వకపోయినా, కనీసం నామినేషన్ వెయ్యడానికి కూడా బీసీలు పనికిరారా అనే చర్చ సాగుతుంది. బీసీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి కి నామినేషన్ వేయనీయకుండా తనను అడ్డుకున్నారని, రాజాసింగ్ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిజంగా బీసీలు భాజపా లో అగ్ర పదవులకు పనికిరారా అనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 

అంతే కాకుండా పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రాజసింగ్ బహిరంగంగా ఆరోపణలు చేసినా, తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా, బీజేపీ అధిష్టానం రాజసింగ్లై ని లైట్ తీసుకోవడంతో బీజేపీ లో బీసీల పట్ల ఉన్న చిన్నచూపు కి నిదర్శనముగా చెప్పవచ్చు.

బీజేపీ పై బీసీ సంఘాల ఆగ్రహం

బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, సంఘాలు బహిరంగంగా స్పందిస్తూ, "బీజేపీకి బీసీల ఓట్లు మాత్రమే కావాలి, కానీ నాయకత్వానికి అవకాశం మాత్రం ఇవ్వరా?" అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. కొందరు నేతలు అయితే బీజేపీని “బ్రాహ్మణ-బనియా పార్టీ”గా కూడా అభివర్ణిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బీసీల పట్ల అనుచిత వైఖరి పెద్ద దెబ్బతీయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా బిసిలను బీజేపీ విస్మరిస్తే, బీజేపీ ని బీసీలు విస్మరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీసీ సంఘాలు బీజేపీ పై అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
















Post a Comment (0)
Previous Post Next Post