BJP President N. Ramchander Rao Biography: తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు బయోగ్రఫీ

BJP President Naraparaju Ramchander Rao Biography: సమాజసేవే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తూ, సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు ఎన్. రామచందర్ రావు గారు. అభివృద్ధే ఆయన నినాదం. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ, పేదవారికి కూడు–గూడు అందేలా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే నేత. ప్రజల్లో మమేకమవుతూ, వారి ఆశయాలను తనదిగా మలుచుకుంటూ... ప్రజల మనిషిగా పేరు పొందారు. 'వృత్తి ఉపాధి ఇస్తుంది, ప్రవృత్తి సంతృప్తిని ఇస్తుంది' అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం. న్యాయవాదిగా వృత్తిలో పరిపక్వతను పొందిన ఆయన, ప్రజల కోసం నిరంతరం పనిచేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా... పలు కీలక పదవులు నిర్వర్తించారు. అలాంటి ఎన్. రామచందర్ రావు గారి జీవితం, రాజకీయ ప్రయాణం, ప్రజల పట్ల ఆయన నిబద్ధత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.


విద్యార్థి నాయకత్వం నుండి రాజకీయ రంగం: 1959లో హైదరాబాద్‌లో జన్మించిన నారపరాజు రామచందర్ రావు చిన్ననాటి నుంచే విద్యలో ఉత్సాహం, సమాజం పట్ల బాధ్యతతో ఎదిగారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో M.A చేసిన తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో ఆయన విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిగా, ఉస్మానియాలో కార్యదర్శిగా కొనసాగారు. ఆ దశనే ఆయన లోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. యువ మోర్చా మొదటి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అలా మొదలైన ప్రయాణం రాజకీయాల్లో స్థిరంగా మారింది.

రాజకీయ ప్రవేశం - తొలి ఓటములు: భారతీయ జనతా పార్టీలో లీగల్ సెల్ కన్వీనర్, జాయింట్ కన్వీనర్ హోదాల్లో పనిచేసిన రామచందర్ రావు, 2009లో తొలిసారి శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో కేవలం 2768 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కానీ ఈ ఓటములు ఆయనలోని ఉత్సాహాన్ని చంపలేకపోయాయి.

Also Read: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా బయోగ్రఫీ

ఎమ్మెల్సీగా గెలుపు: 2015లో మళ్ళీ అదే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన రామచందర్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి జి. దేవీప్రసాద్ రావును ఓడించి తన తొలి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా 2015 నుండి 2021 వరకు పనిచేశారు. విద్యా రంగంలో సంస్కరణలు, పట్టభద్రుల సమస్యలు, అభివృద్ధి సమస్యలపై మండలిలో గళమెత్తి మాట్లాడారు. న్యాయవాదిగా ఉన్న అనుభవం వల్ల ఆయన ప్రశ్నలు పదునుగా ఉండేవి. ఎమ్మెల్సీగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నేతగా గుర్తింపు పొందారు.

నిరంతర పోరాటం: 2018లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీ చేసిన ఆయన, ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73,698 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, సురభి వాణి దేవి చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన రాజకీయ జీవితం నిలిచిపోలేదు. ఓటములు ఆయన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు. ఎందుకంటే, ఆయనకు ప్రజల సేవ అనే ధ్యేయం ఉంది.

ప్రస్తుత పరిస్థితి: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ ఆయనను మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. ఇది ఆయన రాజకీయంగా మరో అవకాశం. 2017లో హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు బలమైన స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉంది. రాజకీయాల్లో పదవులు వస్తాయో లేదో అనే విషయాన్ని పక్కనపెడితే... ప్రజల కోసం నిరంతరం పని చేయాలనే తపన ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టింది.

కుటుంబ నేపథ్యం: రామచందర్ రావు గారు విద్యా వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ NVRLN Rao ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫాకల్టీ డీన్‌గా పనిచేశారు. కుమార్తె అముక్త నారపరాజు ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో డైరెక్టర్‌గా ఉన్నారు. కుమారుడు అవనీష్ నారపరాజు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఆయన భార్య సావిత్రి గారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో 2017లో మృతి చెందారు. 

సామాజిక అంశాల పట్ల అవగాహన, ప్రజల పట్ల బాధ్యత ఆయనకి ప్రత్యేకత. ఒకవైపు న్యాయవాదిగా వృత్తి నిర్వహిస్తూ, మరోవైపు బీజేపీతో కలిసి పలు ప్రజా సమస్యలపై గళమెత్తారు. పదవుల కోసం కాకుండా సేవే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన, ప్రజల్లో ఆదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. నిస్వార్థంగా ప్రజల అభివృద్ధికే అంకితమైన నేతగా, ఎన్. రామచందర్ రావు గారు తెలుగు రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

Also Read: వల్లభనేని వంశీ బయోగ్రఫీ

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post