Vallabhaneni Vamsi Mohan Biography: వల్లభనేని వంశీ బయోగ్రఫీ

Vallabhaneni Vamsi Mohan Biography: గన్నవరం మాజీ MLA జైలు నుండి బయటకు రాగానే ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారా? తన ఈ పరిస్థితికి కారణం ఎవరో చెప్పబోతున్నారా? మరొకసారి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరబోతున్నారా? అంటే వల్లభనేని వంశీ సన్నిహితుల నుండి అవును అనే సమాధానం వస్తుంది. వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ పట్టాల కేసు, భూ కబ్జాల కేసు ఇలా ఏవైతే కేసులు ఉన్నాయో వాటిల్లో వంశీని అరెస్టు చేసారు. ఒక దానిలో బెయిల్ వస్తే, మరొకదానిలో PT వారెంట్ ద్వారా కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికి అయితే కొన్ని బెయిల్లు వచ్చాయి. అయితే మరొక PT వారెంట్ వేయడం ద్వారా వల్లభనేని వంశీ ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఫిబ్రవరి 13వ తేదీన వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దాదాపుగా 100 రోజులుకి పైగానే రిమాండు ఖైదీగానే వంశీ ఉన్నారు. ఈ నేపథ్యములో వంశీ గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

తెలుగు దేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని .. వైసీపీలో కీలక నేతగా మారారు. తెలుగుదేశం పార్టీ తరుపున కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం నుండి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేతగా మారారు. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవి గారికి అనుచరుడిగా, సినిమా నిర్మాతగా గుర్తింపు పొందారు. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర  పోషించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ 

వల్లభనేని వంశీ మోహన్ గారు... 1972లో రమేష్ చంద్, అరుణ గారి దంపతులకు ఏపీలోని కృష్ణా జిల్లా, గన్నవరంలో జన్మించారు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. చిన్నతనం నుంచి చదువుల్లో చురుకగా ఉండేవారు. ఆయన ఉంగుటూరులో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఏడో తరగతిలో ఆయన స్టేట్ ర్యాంక్ కూడా పొందారు. ఎనిమిదో తరగతి నుంచి పదోవ తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు.ఆ సమయంలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు. విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి.. వెటర్నరీ డాక్టర్ గా మాస్టర్ కోర్స్ ని తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత వంశీ అమెరికా వెళ్దామని ప్రయత్నించారు. కానీ, ఆయనకు వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు. రియల్ ఏస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారు. 

ఈ తరుణంలో పరిటాల రవి ఆయనకు పరిచయం ఏర్పడింది. అతికొద్ది రోజుల్లోనే పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు. ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేశారు. వంశీని పరిటాల రవి సొంత తమ్ముడిలా చూసుకునేవారట.  పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణించడానికి అందరూ భయపడేవారట. కానీ, వంశీ మాత్రం ఆయనతో ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేసేవారు. ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు. 

Also Read: తెలంగాణ చరిత్రలోనే అత్యంత విషాదకరంగా నిలిచిన పాశమైలారం పేలుడు ప్రమాదం.!

మరోవైపు..  వంగవీటి రాధా, కొడాలి నాని ఆయనకు మంచి స్నేహితులు. ఈ సమయంలో కొడాలి నానితో నందమూరి కుటుంబంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా తారక్, హరికృష్ణలో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.  ఇక రాజకీయాల్లోకి రావాలని కోరికతో 2006లో ఆయన టిడిపిలో చేరారు. ఈ సమయంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి.. ఎన్టీఆర్ సహాయం చేశారు. ఎన్టీఆరే దగ్గరుండీ ఎంపీ టికెట్ ఇప్పించారట.  

ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈ సమయంలోనే వంశీ ద్రుష్టి సినిమాల మీద పడింది. ఆయన సినిమా నిర్మాతగా మారారు. 2009లో పున్నమినాగు, 2010లో జూ. ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమా నిర్మించారు. ఆ తర్వాత రవితేజతో 2018లో టచ్ చేసి చూడు అనే సినిమాను కూడా తీశారు.

ఇక ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుట్ట రామచంద్రరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సిపి లో చేరతారని వార్తలు వినిపించాయి. ఈ సమయంలో వంశీని జగన్ ఆలింగనం చేసుకున్న దృశ్యం చాలా మందికి గుర్తుండేంటుంది. కానీ, పార్టీ మారకుండా టిడిపిలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే ఈ ఎన్నికల తరువాత ఆయన టిడిపికి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ టీడిపిని వీడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరుపున గన్నవరం నుంచి పోటీ చేసి టీడీపి అభ్యర్థి  యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. 

పలు కేసుల్లో నిదిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దాదాపుగా 100 రోజులుకి పైగానే రిమాండు ఖైదీగానే వంశీ ఉన్నారు. వంశీని అరెస్టు చెయ్యడం వైసీపీ నాయకులు ఖండిస్తూ ఉంటే... టీడీపీ నాయకులు మాత్రం ఈ పనిని ఎప్పుడో చెయ్యాల్సింది అని అంటున్నారు. మనుషులు వాడని దారుణమైన భాష వాడి, లెక్కలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నాడని, మరిన్ని కేసులు ఆయనపై నమోదు అవ్వడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: టీటు సింగ్ పునర్జన్మ కథ

Post a Comment (0)
Previous Post Next Post