Shravana Masam: శ్రావణ మాసం వచ్చింది అంటే… ఆధ్యాత్మికత, ఉపవాసాలు, భక్తితో కూడిన అనేక ఆచారాలకు సమయం. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఈ నెల పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చాలామంది మహిళలు ఉపవాసాలు ఉండటం, మాంసాహారం మానేయడం, మరియు వెల్లుల్లి, ఉల్లిపాయల వంటివి తీసుకోవడం మానేయడం సహజం. అయితే ఇవన్నీ కేవలం మతపరమైన విశ్వాసాలేనా? లేక శాస్త్రీయ కారణాలున్నాయా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది.
మొదట మతపరమైన కారణాల గురించి చూస్తే… శ్రావణ మాసంలో శివుడికి కోసం ఉపవాసం, పూజలు వంటి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉంటాయి. ఈ సమయంలో తామసిక ఆహారాన్ని మానేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి తామసికంగా పరిగణించబడతాయి. ఇవి శరీరంలో ఆక్రోశం, అలసటను పెంచుతాయని పురాణాల ద్వారా చెబుతారు. అందుకే భక్తులు ఆహార నియమాలను పాటిస్తూ శ్రద్ధతో ఈ మాసాన్ని గడుపుతారు.
ఇక శాస్త్రీయంగా చూస్తే… వర్షాకాలం అంటే శరీరంలోని జీర్ణవ్యవస్థ నెమ్మదిగా మారే కాలం. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎక్కువ ఘాటు కలిగి ఉండటంతో, అవి ఈ సమయంలో జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నట్టు… వర్షాకాలంలో ఇవి తీసుకుంటే గ్యాస్, వాంతులు, మంట వంటి సమస్యలు రావచ్చు. అందుకే, శ్రావణ మాసంలో ఇవి తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు.
అంతేకాదు, ఆకుపచ్చ కూరగాయలు, వంకాయలు వంటివి కూడా తినకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణ తేమ అధికంగా ఉంటుంది. దీని వలన బ్యాక్టీరియా, కీటకాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల్లో దాగి ఉండే అవకాశం ఉంది. వంకాయలు కూడా జీర్ణక్రియకు కష్టమైన కూరగాయలు కావటంతో, వీటిని తినకుండా ఉండటం మంచిదని అంటున్నారు.
ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే… తులసి, అల్లం టీ, గంజి, కిచ్డీ లాంటి తేలికపాటి ఆహారాలను తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణానికి తేలికగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బఠానీలు, శనగలు వంటి ప్రోటీన్ కలిగిన పదార్థాలు కూడా శక్తినివ్వగలవు. అలాగే భోజనం చేసే ముందు నోటిని శుభ్రంగా కడగడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
Also Read: వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS