Hari Hara Veeramallu USA Talk: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటుడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా… ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూడటం మామూలే కాదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్, ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తిచేయాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే “హరిహర వీరమల్లు” సినిమా త్వరలోనే థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిన నేపథ్యంలో, ఈ సినిమాపై మొదటి స్పందనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సినిమా కథకు వస్తే… కోహినూర్ డైమండ్ చుట్టూ కథ అల్లుకుంది. నిజాం రాజులు దాన్ని ఎలా అందుకోవాలని యత్నించారు? ప్రజలు ఏవిధంగా బాధపడ్డారు? వీరమల్లు ఆ ప్రజల కోసం ఎలా పోరాడాడు? అనే అంశాల మీద కథ సాగుతుంది. కథనంగా చూస్తే పూర్వ కాలం నేపథ్యంలో మంచి డ్రామా ఉంది. కానీ… ఆ కథను తెరకెక్కించడంలో దర్శకుడు జ్యోతికృష్ణకు పూర్తిగా నెగ్గలేదు అన్నదే తొలి టాక్.
సినిమాలో ఎమోషనల్ సీన్స్ బలహీనంగా ఉన్నాయని, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందని తెలుస్తోంది. మధ్య మధ్యలో వచ్చే అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని కోల్పోయేలా చేస్తున్నాయని అభిప్రాయాలొస్తున్నాయి. కంటెంట్ బాగున్నప్పటికీ, పవన్ లాంటి స్టార్ ను డైరెక్ట్ చేయడంలో దర్శకుడు అంత నెరవేరలేదనే ఫీల్ స్పష్టంగా కనిపిస్తోందట. ప్రేక్షకుల హై ఎక్స్‌పెక్టేషన్‌ను మేనేజ్ చేయడంలో టీమ్ తడబడినట్టు అర్థమవుతోంది.
Also Read: హరి హర వీరమల్లు ట్రైలర్ విడుదల.. పవన్ కళ్యాణ్ యాక్షన్ అదిరిపోయిందిగా.!
టెక్నికల్ విషయంలో కూడా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినట్టు సమాచారం. గ్రాఫిక్స్, విజువల్స్ చాలా మామూలుగానే ఉన్నాయని అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఎటువంటి ప్రభావం కలిగించలేదట. ఫైట్స్ ఓవర్‌గా ఫీల్ అయ్యాయని ఫీడ్‌బ్యాక్. మ్యూజిక్ పరంగా ఎం.ఎం. కీరవాణి పాటలు సరే అనిపించాయట, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత బలంగా ఉండాల్సిందని విమర్శలొస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులకు నచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన వేసిన గెటప్, యాక్షన్ బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ కి హైలైట్ అయ్యేలా ఉంది. అలాగే బాబీ డియోల్ కూడా తన పాత్రలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి... ఇది పవన్ ఫ్యాన్స్ కి ఓ ప్యాషన్ ప్రాజెక్ట్ లా అనిపించవచ్చేమో కానీ, సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంచనాలకు తగ్గ స్థాయిలో ఉందా? అన్నదే ఇప్పుడు చర్చ.
Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.!