Sania Mirza Second Marriage: మరోసారి పెళ్లి పీటలెక్కనున్న సానియా మీర్జా? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలు!

Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ చాంపియన్, గ్రాండ్‌స్లామ్ విజేత సానియా మీర్జా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా, కొన్ని సంవత్సరాల వైవాహిక జీవితానంతరం విడాకులు తీసుకుని ప్రస్తుతం కొడుకుతో కలిసి సింగిల్ మదర్‌గా జీవిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందా?

తాజా బజ్ ప్రకారం, సానియా మిర్జా ఒక టాలీవుడ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒక కాఫీ షాప్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారనే వార్తలతో పాటు, వారి మధ్య ఉన్న క్లోజ్‌ బాండింగ్‌ను సూచించే కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ హీరో ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఇదే నేపథ్యంలో ఆమె రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ వైరల్ అయిన రూమర్స్

ఇదే రూమర్లు గతంలోనూ వినిపించాయి. క్రికెటర్ మహమ్మద్ షమీతో సానియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ దశలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై తానే కాకుండా ఆమె తండ్రి సైతం క్లారిటీ ఇచ్చి తిప్పికొట్టారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోతో సంబంధం ఉన్నట్టు మరోసారి వార్తలు వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Sania Mirza with Ex Husband Shoaib Malik
Sania Mirza with Ex Husband Shoaib Malik

Also Read: సమంత రెండో పెళ్లి అతనితోనా? వైరల్‌గా బ్యూటీ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్

కెరీర్ పరంగా సానియా స్టార్డమ్

కెరీర్ పరంగా సానియా మీర్జా దేశానికే గర్వకారణం. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. 2003 నుంచి 2013 వరకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారతదేశం తరఫున నెంబర్ వన్ ప్లేయర్‌గా కొనసాగారు. అలాగే, అత్యధిక పారితోషకం అందుకున్న అథ్లెట్‌గా, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో 14 పతకాలు -  వాటిలో 6 బంగారు పతకాలు సాధించడం ఆమె ఘనత.

అసలేం జరుగుతోంది?

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. కానీ ప్రజల్లో ఆసక్తి మాత్రం తారాస్థాయిలో ఉంది. ఇలాంటి వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఏదీ తేల్చి చెప్పలేం. అయినా… ఒకప్పుడు మిలియన్ డాలర్ వెడ్డింగ్ జరుపుకున్న సానియా మళ్లీ ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారంటే, అది ఎంతమాత్రం ఆసక్తికరమో చెప్పక్కర్లేదు.

Also Read: అఖిల్ పెళ్లిపై నెటిజన్ల సెటైర్లు.! అలా చేసినందుకేనా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post