Kanda Dumpa Health Benefits: మన తెలుగువారి సంప్రదాయ వంటకాలలో కంద దుంపకు ప్రత్యేక స్థానం ఉంది. పులగంద అని పిలిచే ఈ దుంపతో పులుసు, వేపుడు, టమోటా కూరలు వంటివి రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడే ముందు పొట్టు తీసి బాగా కడగాలి. ఆహారంలో భాగంగా కందను చేర్చుకుంటే అది ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ దుంపలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.
కందను డైట్ ఫుడ్ గా తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 100 గ్రాముల ఉడికించిన కందలో తక్కువ క్యాలరీలు ఉండడం దీన్ని డైట్ ఫుడ్‌గా మార్చింది. ఇందులో పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు (B6, C, B9, B1, B2, B3), మరియు ఖనిజాలు (పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్) సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఫ్లేవనాయిడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి అరుదైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: ఉసిరి జ్యూస్ ప్రతిరోజూ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.!
ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది జీర్ణవ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్దకం నివారించడంలో సహాయపడుతుంది. కంద ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేసి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, పైల్స్ సమస్య ఉన్నవారికి కంద ఎంతో మేలు చేస్తుంది. అల్సర్ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
కంద డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే ఆహారం. కందలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువగానే ఉంటాయి. ఇందులో ఉండే అలంటోయిన్ అనే పదార్థం ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. దీనివల్ల షుగర్ నియంత్రణ సాధ్యమవుతుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో కంద కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది పేరుకు దుంప అయినా, తక్కువ క్యాలరీలు ఉండటం, అధిక ఫైబర్ ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఆప్షన్ అవుతుంది. ఇది కడుపునిండిన భావన కలిగించి అధిక ఆహారం తీసుకునే అవసరాన్ని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించి ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రధాన ఆరోగ్య సమస్యల నుండి శరీరాన్ని రక్షించే శక్తిని కూడా ఈ దుంప కలిగిస్తుంది.
Also Read: నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
మరిన్ని Latest Health Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V Health