Roja Daughter Ramp Walk: రోజా కుమార్తె అన్షు రెడ్డి… వెండితెర ఎంట్రీకి రెడీనా?

Roja Daughter Ramp Walk: హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకొని, అగ్ర కథానాయికగా ఎదిగి, ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తరువాత ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేతగా కొనసాగుతున్న ఆర్.కె. రోజా సెల్వమణి గురించి తెలియని వారు ఉండరనడంలో సందేహం లేదు. సినిమాలకు ఆమె దూరమైనా, రాజకీయాల్లో మాత్రం ఆమె తన యాక్టివ్ పాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. రోజా మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక వివాదానికి దారితీయడం, ఒకవైపు ఆమె విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేయగా, మరోవైపు ఆమె అభిమానులను ప్రేరేపిస్తోంది. ఒక్కోసారి ఆమె వ్యాఖ్యలు మహిళగా విమర్శలకు తావు ఇచ్చేలా అనిపిస్తే, మరోవైపు "ఐరన్ లేడీ" అనిపించేంత ధైర్యంగా కనిపిస్తుంది.

ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రోజాకు అన్షు రెడ్డి అనే కుమార్తె ఉంది. అన్షు గురించి రోజా ఎన్నో సందర్భాల్లో గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది. చిన్ననాటి నుంచే టాలెంట్ తో మెరిసిన అన్షు రచయితగా మారి కొన్ని పుస్తకాలను రచించింది. అంతేకాదు పోటీల్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. ఫిజికల్‌గా చూసినప్పుడు అన్షు రెడ్డి, రోజాకు జిరాక్స్ కాపీలా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆమె సినిమాల్లోకి అడుగుపెడుతుందో లేదో చెప్పలేం కానీ, ఆమెను "హీరోయిన్ మెటీరియల్" అనడం మాత్రంలో ఎలాంటి సందేహం లేదు. 

Also Read: సమంత రెండో పెళ్లి అతనితోనా?

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో అన్షు ర్యాంప్ వాక్‌ చేసి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె ధరించిన స్టైలిష్ దుస్తులు, తన నడక ధోరణి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజెన్స్ "ఇంత అందంగా ఉందేంటి బాబోయ్! రోజా కూడా ఈమె అందం ముందు సరితూగదేమో!" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఒక రెండు హిట్స్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. వారితో సరితూగేంత అందంగా ఉన్న అన్షు, నటన, డ్యాన్సింగ్ టాలెంట్ ఉంటే మాత్రం ఆమెకు ఇండస్ట్రీలో తిరుగులేదు అంటున్నారు అభిమానులు. మరి ఆమె ఎంట్రీ ఎప్పుడవుతుందో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే, రోజా సినిమాలకు దూరమైనా, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా ఆమెకు ఉన్న క్రేజ్ అపారం. మంత్రి అయిన తరువాత ఆ షోకు దూరమయిన రోజా, ఇప్పుడు మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్‌లో వరుసగా రెండు షోల‌కు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ, టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు పెట్టుకోకూడదో తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post