Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలై చాలా కాలం గడుస్తున్నా, మధ్యలో అనేక కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు మళ్లీ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్‌కు పక్కా ఫెస్టివల్. యోధుడిగా పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్స్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ మాస్‌కు స్పెషల్ ట్రీట్‌లా మారాయి. దాదాపు 2 నిమిషాల 57 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్‌లో పవన్ ఎలివేషన్ సీన్స్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలసి Goosebumps తెప్పించేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించగా, అనంతరం ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ మేక్ ఓవర్ తీసుకున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు.. కానీ, జూలై 2న పాస్‌ల కోసం భారీగా అభిమానులు రావడంతో అక్కడ పరిస్థితి చెల్లాచెదురైంది. భద్రతా దృష్ట్యా ట్రైలర్ స్క్రీనింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
మొత్తానికి, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. పవన్ యాక్షన్ అవతార్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నారు.
Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS