Bank of Baroda LBO Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. గుజరాత్ (1160), కర్ణాటక (450), మహారాష్ట్ర (485) వంటి రాష్ట్రాల్లో పోస్టులు ఎక్కువగా ఉన్నా, దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక్క అభ్యర్థి ఒక్క రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అర్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సీఏ, కాస్ట్ అకౌంటెంట్, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగిన వారు కూడా అర్హులు.
- కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంది: SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు, PWD – 15 ఏళ్లు.
- సిబిల్ స్కోరు కనీసం 680 ఉండాలి.
దరఖాస్తు వివరాలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు: జూలై 4 నుంచి జూలై 24, 2025 వరకు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్, OBC, EWS: ₹850
- SC, ST, PWD, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్: ₹175
ఎంపిక ప్రక్రియ:
1. ఆన్‌లైన్ రాత పరీక్ష
2. సైకోమెట్రిక్ టెస్ట్
3. ప్రాంతీయ భాషా టెస్ట్
4. గ్రూప్ డిస్కషన్
5. ఇంటర్వ్యూ
రాత పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
జీతం - ఇతర ప్రయోజనాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹48,480 నుండి ₹85,920 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ సిబిల్ స్కోరు, ఎక్సపీరియెన్స్ సర్టిఫికెట్, విద్యా అర్హతలతో పాటు సకాలంలో అప్లై చేయండి
బ్యాంక్ ఆఫ్ బరోడా LBO రిక్రూట్మెంట్ 2025 కు దరఖాస్తు ఎలా చేయాలి?
దరఖాస్తుదారులు క్రింది స్టెప్పులు అనుసరించండి:
Step 1: బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: bankofbaroda.in
Step 2: హోం పేజీలో కనిపించే Bank of Baroda LBO Registration 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: ముందుగా రెజిస్ట్రేషన్ పూర్తి చేయండి. తర్వాత మీ లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి.
Step 4: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా పూరించండి.
Step 5: అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి మరియు దరఖాస్తు ఫీజు చెల్లించండి.
Step 6: ఫారాన్ని సబ్మిట్ చేయండి, తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింటౌట్ తీసుకోండి.
Also Read: కవిత లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యినప్పుడు BRS పార్టీ సపోర్ట్ చెయ్యలేదా?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS