Indian Coast Guard Jobs 2025: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్… వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ‘ఏ’ గేజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద జనరల్ డ్యూటీ (జీడీ), టెక్నికల్ (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) విభాగాల్లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్లో 140 జీడీ విభాగానికి, మిగిలిన 30 టెక్నికల్ విభాగానికి చెందాయి. ఈ ప్రకటన 2027 బ్యాచ్‌కు సంబంధించింది. ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు:
జనరల్ డ్యూటీ పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
టెక్నికల్ బ్రాంచ్‌కు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 2026 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తయినట్లు సర్టిఫికెట్ సమర్పించాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, జూలై 1, 2001 నుంచి జూన్ 30, 2005 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంది:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు
ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు
ఇతర అర్హతలు:
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు జులై 23, 2025 వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: ₹300
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం – ఐదు దశలు:
స్టేజ్-I: ఆన్‌లైన్ రాత పరీక్ష
స్టేజ్-II: అర్హతా పరీక్షలు, గ్రూప్ డిస్కషన్
స్టేజ్-III: సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ
స్టేజ్-IV: న్యూఢిల్లీ బేస్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు
స్టేజ్-V: మెరిట్ ఆధారంగా తుది ఎంపిక
ఈ ఐదు దశలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 జీతంతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే నెలకు రూ.85,000 వరకు జీతం
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS